పీసీకి వెల్ కమ్ చెప్తున్న సోఫి టర్నర్

Update: 2018-08-19 10:34 GMT
గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ జంట పక్షుల్లా విహరించడం ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ వార్తలు.. రింగు దాచిపెట్టడం ఇవన్నీ ఇప్పుడు ఓల్డ్ న్యూస్.  ఇప్పుడు ఎంగేజ్ మెంట్ విషయన్ని ఇద్దరూ ధ్రువీకరించారు.  పైగా పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక నిక్ జోనాస్ ఫ్యామిలీ మెంబర్స్ పీసీకి వెల్కం చెప్తున్నారు.  

ఇప్పటికే నిక్ సోదరుడు జో జోనాస్ ట్విట్టర్ ద్వారా "నా బ్రదర్ విషయం లో చాలా సంతోషంగా ఉన్నాను.  ప్రియాంక.. మా కుటుంబం లోకి స్వాగతం. వీ లవ్ యు" అని స్పందించాడు.  దాంతో పాటు గా పలువురు నిక్ ఫ్యామిలీ మెంబర్స్ పీసీకి స్వాగతం పలుకుతున్నారు.  వీరందరితో పాటుగా గేమ్ ఆఫ్ త్రోన్స్ వెబ్ సీరీస్ లో సన్సా స్టార్క్ పాత్ర పోషించిన సోఫీ టర్నర్ కూడా పీసీ కి 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ' అంటూ స్వాగతం పలికింది.  మరి ఈమె పీసీ ని ఎందుకు ఫ్యామిలీ లోకి ఆహ్వానించింది అని మీకు అనుమానం రావొచ్చు.  ఈ ముద్దుగుమ్మ నిక్ సోదరుడు జో జోనాస్ తో డేటింగ్ చేస్తూ ప్రేమాయణం సాగిస్తోంది. దాంతో ఆమె - ప్రియాంక కాబోయే తోడి కోడళ్ళు కదా అందుకే అలా వెల్ కమ్ చెప్పింది.

ఇక ఈ స్వాగతాలు గట్రా అయిపోయాయి కాబట్టి త్వరలో ఇక మీరు కూడా ప్రియాంక జోనాస్ అనే కొత్త పేరు వినేందుకు సిద్దంగా ఉండండి.. లేకపోతే ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాగా ప్రియాంక చోప్రా జోనాస్!
Tags:    

Similar News