• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంక్రాంతి దర్శకులు.. ఎవరి...

సంక్రాంతి దర్శకులు.. ఎవరి బలమెంత?

By - Tupaki Desk
Update: 2022-12-01 17:00 GMT
2023 సంక్రాంతికి అగ్ర హీరోల నుంచి అతిపెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి తమిళ హీరో విజయ్ వారసుడు సినిమా కూడా భారీ స్థాయిలోనే విడుదల కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలకు సంబంధించిన అనేక రకాల విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే కేవలం ఇది స్టార్ హీరోల మధ్యలో కొనసాగే ఫైట్ మాత్రమే కాదు. ముగ్గురు తెలుగు దర్శకుల మధ్యలో కొనసాగే ఫైట్ అని కూడా చెప్పవచ్చు.

ఇంతకుముందు ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు సంక్రాంతికి వచ్చినవి కూడా ఉన్నాయి. గోపిచంద్ మలినేని 2020 సంక్రాంతికి క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ విజయాన్ని అందుకున్నాడు. ఇక గతంలోనే సంక్రాంతి ఫెస్టివల్స్ లో డాన్ శీను, బలుపు, పండగచేస్కో వంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు వీర సింహా రెడ్డి వస్తోంది.

ఇక బాబీ దర్శకత్వంలో వచ్చిన 4 సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చినవి ఉన్నాయి. అందులో పవర్, వెంకీమామ సక్సెస్ కాగా సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు మెగాస్టార్ తో బాబీ డైరెక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

మరో కమర్షియల్ దర్శకుడు వంశీ పైడిపల్లి దిల్ రాజు సపోర్ట్ తోనే సంక్రాంతికి 4 సినిమాలను తీసుకు వచ్చాడు. ఇక అందులో మున్నా ఫ్లాప్ కాగా, బృందావనం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఎవడు, మహర్షి కూడా కమర్షియల్ గా కూడా హిట్ అయ్యాయి.

ఊపిరి సినిమా కూడా పరవాలేదు అనిపించింది. ఇక ఈ సంక్రాంతికి వంశీ విజయ్ తో వారసుడు అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ముగ్గురి కమర్షియల్ దర్శకుల్లో గోపిచంద్ మలినేని బాలకృష్ణతో మాస్ ఓపెనింగ్స్ హై రేంజ్ లో అందుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి ఈ ఫైట్ లో ఫైనల్ విన్నర్ ఎవరవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • movies 
  • WaltairVeerayya 
  • VeeraSimhaReddy 
  • varasudu 
  • dilraju 
  • latestnews 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS