శంఖం సినిమా వివాదం.. నిర్మాతకు ఏడాది జైలు శిక్ష!
ఎప్పుడో పదేళ్ల కిందట వచ్చిన శంఖం సినిమాకు సంబంధించిన ఒక వివాదంలో నిర్మాత నట్టికుమార్ కు ఏడాది జైలు శిక్ష విధించింది విజయనగరం మొబైల్ కోర్టు. చిన్న సినిమాలు, విడుదల ఆగిపోయిన సినిమాలను రిలీజ్ చేసే ప్రొడ్యూసర్ గా పేరుంది నట్టికుమార్ కు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏవో సినిమాలను ఆయన విడుదలు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒక వివాదంలో ఆయనకు జైలు శిక్ష పడటం గమనార్హం.
ఇంతకీ ఆ వివాదం ఏమిటంటే.. గోపిచంద్ హీరోగా నటించిన శంఖం సినిమాను కరుణాలయ ఫిల్మ్స్ పేరుతో డిస్ట్రిబ్యూట్ చేశారట నట్టికుమార్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మేరకు విజయగనంరలోని రాజ్యలక్ష్మి థియేటర్లో శంఖం సినిమాను రెండు వారాల పాటు ప్రదర్శితం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. అందుకు గానూ 6.5 లక్షల రూపాయల ఒప్పందం చేసుకున్నారట.
అయితే వారం రోజులకే ఆ సినిమా ప్రదర్శనను ఆపేశారట. దీంతో ఆ థియేటర్ యాజమాన్యానికి, నట్టికుమార్ కు మధ్యన వివాదం రేగిందట. దాన్ని పంచాయతీ చేసి.. చివరకు థియేటర్ యాజమాన్యానికి 5.5 లక్షల రూపాయలను నట్టికుమార్ చెల్లించేలా సెటిల్ చేసుకున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించి చెక్ ను యాజమాన్యానికి ఇచ్చారట నట్టికుమార్. అది బౌన్స్ అయ్యిందట. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. విచారించిన న్యాయస్థానం 6 లక్షల రూపాయలను నట్టికుమార్ చెల్లించాలని, దాంతో పాటు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చినట్టుగా తెలుస్తోంది.