శర్వానంద్ ‘బైకర్’ బాక్సాఫీస్.. గట్టెక్కాలంటే..
శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ సినిమా నిన్న మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోటో క్రాస్ రేసింగ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి చర్చ సాగింది.;
శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ సినిమా నిన్న మంచి బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోటో క్రాస్ రేసింగ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి చర్చ సాగింది. ముఖ్యంగా శర్వానంద్ గత సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ ఇవ్వడంతో, ఈ ప్రాజెక్టుకు ట్రేడ్ పరంగా కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మాణం కావడంతో పాటు రాజశేఖర్ వంటి సీనియర్ హీరో తోడవ్వడం సినిమా స్థాయిని పెంచాయి.
అయితే, థియేట్రికల్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే శర్వానంద్ ముందు ఒక పెద్ద బాధ్యత ఉందనే చెప్పాలి. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి దీనికి డీసెంట్ ఓపెనింగ్స్ లభించాయి. రేసింగ్ నేపథ్యంలో సాగే కొత్త తరహా కథ కాబట్టి, యూత్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. సాంకేతికంగా సినిమా బాగుందనే టాక్ ఒక వర్గం ఆడియన్స్‌లో బలంగా వినిపిస్తోంది.
అయితే, కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా భారీగా థియేటర్లకు రప్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కొంత సవాల్‌తో కూడుకున్న విషయమే అనిపిస్తోంది. అసలు విషయానికి వస్తే, ‘బైకర్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే కనీసం రూ.21 కోట్ల షేర్ రాబట్టాలి. శర్వానంద్ గత హిట్ ఈ బిజినెస్ కావడానికి బాగా ఉపయోగపడింది, కానీ ఈ టార్గెట్ ను చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొన్ని అడ్డంకులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఐపీఎల్ క్రేజ్ ఉండటం, మరోవైపు విద్యార్థులకు పరీక్షల సీజన్ నడుస్తుండటం వల్ల థియేటర్ల దగ్గర సందడి కొంత తగ్గే అవకాశం ఉంది. సినిమాకు వచ్చిన డీసెంట్ ఓపెనింగ్స్ నిలబడాలంటే వీకెండ్ వసూళ్లు చాలా కీలకం. కేవలం టాక్ బాగుందని సరిపెట్టుకోకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద పట్టు సాధించాలి. కలెక్షన్ల పరంగా చూస్తే సినిమా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
ప్రాంతాల వారీగా బిజినెస్ వివరాలు:
రూ.7 కోట్లు: తెలంగాణ
రూ.2 కోట్లు: సీడెడ్
రూ.7 కోట్లు: ఆంధ్ర (టోటల్)
రూ.4 కోట్లు: రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
రూ.21 కోట్లు: బ్రేక్ ఈవెన్ టార్గెట్ (షేర్)
దర్శకుడు అభిలాష్ రెడ్డి ఎంచుకున్న రేసింగ్ పాయింట్ సినిమాకు ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. రాజశేఖర్, శర్వానంద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సినిమా క్లీన్‌గా ఉండటం కూడా ప్లస్ పాయింట్. అయితే రూ.21 కోట్ల షేర్ అంటే అది శర్వానంద్ రేంజ్‌కు ఒక పెద్ద పరీక్షే. వీకెండ్ ముగిసేలోపు వసూళ్లు గణనీయంగా పెరిగితే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమవుతుంది. కేవలం క్లాస్ ప్రేక్షకులే కాకుండా మాస్ ఆడియన్స్‌ను కూడా ఈ రేసింగ్ ఎంతవరకు అలరిస్తుందనేది చూడాలి.
శర్వానంద్ ‘బైకర్’ రేసులో నిలబడాలంటే రాబోయే రోజుల్లో స్థిరమైన వసూళ్లు రాబట్టాలి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా, టార్గెట్ పెద్దది కాబట్టి లాంగ్ రన్ చాలా ముఖ్యం. మరి ఈ ‘బైకర్’ బాక్సాఫీస్ రేసులో ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.