షూటింగ్ కు రెడీ అయిన అధీర
కేజీఎఫ్ సినిమా సెన్షేషనల్ సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం రూపొందుతున్న కేజీఎఫ్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ 2 లో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. అత్యంతభయంకరమైన అధీర పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. బ్యాలన్స్ వర్క్ పూర్తి చేయాలనుకుంటూ ఉండగా కరోనా లాక్ డౌన్ అయ్యి ఆరు నెలలు షూటింగ్ జరగలేదు. ఆసమయంలోనే దత్ కు క్యాన్సర్ అంటూ నిర్థారణ అవ్వడంతో షూటింగ్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది. బ్యాలన్స్ షూట్ ను సంజయ్ దత్ పూర్తి చేస్తాడా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఇటీవల సంజయ్ దత్ క్యాన్సర్ ను జయించినట్లుగా ప్రకటించాడు. క్యాన్సర్ ను ఇంత త్వరగా సంజయ్ దత్ జయించడంతో అభిమానులు ఆశ్చర్యం.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ దత్ షూటింగ్స్ కు కూడా రెడీ అవుతున్నాడు. త్వరలో కేజీఎఫ్ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. క్లైమాక్స్ లో అత్యంత భయంకరమైన ఫైటింగ్ ను యశ్ తో కలిసి సంజయ్ దత్ చేయబోతున్నాడు. అనారోగ్య పరిస్థితులు ఉన్నా కూడా సినిమా కోసం ఆయన షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో కేజీఎఫ్ 2 ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే విడుదల కోసం సంజయ్ దత్ కాస్త ఇబ్బంది అయినా షూటింగ్ లో పాల్గొనేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. అతి త్వరలోనే సంజయ్ దత్ షెడ్యూల్ కు సంబంధించి వార్త వచ్చే అవకాశం ఉంది.