క్యాన్సర్ అని తెలిశాక 4 ఫ్లాట్లు భార్యకు రాసిచ్చిన స్టార్ హీరో.. వాటి విలువ ఎంతంటే?
ఆ స్టార్ హీరో తనకు క్యాన్సర్ అని తెలిశాక తన భార్య పిల్లల కోసం ఏకంగా 27 కోట్ల విలువ చేసే నాలుగు ఫ్లాట్లను రాసిచ్చాడు. ఆ నాలుగింటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో?... పూర్తి వివరాల్లోకి వెళితే..
2020 డిసెంబర్ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న నాలుగు అపార్టుమెంటులను బహుమతిగా ఇచ్చారు. అతి తక్కువ వ్యవధిలో ఈ పనిని పూర్తి చేశాడు. అతను ఈ అపార్టుమెంటులను భార్య మాన్యతాదత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
మున్నాభాయ్ సంజయ్ దత్... డిసెంబరులో బహుమతి దస్తావేజు(గిఫ్ట్ డీడ్) చేయించి 26 కోట్ల రూపాయల విలువైన నాలుగు ఫ్లాట్లను మాన్యతకు బహుమతిగా ఇచ్చారు. ఈ నాలుగు ఫ్లాట్లు పాలి హిల్ ఇంపీరియల్ హైట్స్ లో ఉన్నాయి. సంజయ్ తండ్రి సునీల్ దత్ (బలరాజ్) .. నర్గిస్ దత్ నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి ఇది.
సంజయ్ దత్ 2020 డిసెంబర్ 3 న ఈ నాలుగు ఫ్లాట్లను మాన్యతకు బహుమతిగా ఇచ్చే డాక్యుమెంటేషన్‌ను చేపట్టారు. ఆపై 2020 డిసెంబర్ 23న బహుమతి పత్రాలను రిజిస్ట్రేసన్ చేశారు. 301.. 401.. 1101 .. 1201 అపార్టుమెంటులను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇవన్నీ 17 కార్ పార్కింగ్ స్పేస్ లు కలిగి ఉన్నాయి. ఈ ఫ్లాట్ల విలువ 26.46 కోట్ల రూపాయలు. మాన్యత అసలు పేరు దిల్నాషిన్ దత్. ఆ పేరుతోనే ఇవన్నీ రిజిస్టర్ అయ్యాయిట.
సంజయ్ దత్ కి మూడో దశ క్యాన్సర్ అన్న సంగతి 2020 ఆగస్టులో బయటపడింది. ఆ తర్వాత ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అక్టోబర్ లో తాను ఆరోగ్యంగా ఉన్నానని.. క్యాన్సర్ తో పోరాడటానికి సహకరించిన వైద్యులకు .. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంపీరియల్ హైట్స్ భవనం సంజయ్ తల్లి పేరు మీద నర్గిస్ దత్ రోడ్ లో ఉంది. ఈ బహుమతి కథనాలపై స్పందించమని కోరితే మాన్యత ఇంతవరకూ స్పందించలేదని తెలిసింది.