ఈ కష్టాలకు బదులు చంపేయమని దేవుడ్ని కోరుకున్న నటి

Update: 2021-02-21 05:50 GMT
తెలుగు మీడియాలో పెద్దగా కవర్ కాలేదు కానీ.. కర్ణాటకలో పెనుదుమరానికి కారణమైంది శాండల్ వుడ్ డ్రగ్స్ రాకెట్. ఈ ఉదంతంలో కొందరు సినీ ప్రముఖులు సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అందులో ఒకరు నటి సంజనా గల్రానీ. తెలుగులో కొన్ని సినిమాలుచేసిన ఆమె.. తర్వాత శాండల్ వుడ్ లో సెటిల్ అయ్యారు. ఇటీవల వెలుగు చూసిన డ్రగ్ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ వైనం షాకింగ్ గా మారింది.

ఈ మధ్యనే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలలుగా తాను ఏడుస్తూనే ఉన్నానని.. బహుశా తన కంట్లో కన్నీళ్లు అయిపోయి ఉంటాయేమోనని పేర్కొన్నారు. ‘ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అని దేవుడ్ని ప్రార్థించా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎదురయ్యే ప్రతి విషయాన్ని నవ్వుతూ ఎదుర్కొని విజయం సాధించాలనుకుంటున్నానని చెప్పారు.

న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని.. అన్నింటికి సమయమే సమాధానం చెబుతుందని పేర్కొంది. తాను ప్రయాణించాలని అనుకుంటున్న రహదారి చాలా రఫ్ గా ఉంటుందని తనకు అర్థమైందన్నారు. దాన్ని దాటేసి.. మళ్లీ ఎప్పటిలానే పైకి ఎగరాలనుందన్న ఆశను వెల్లడించింది. త్వరలోనే తన పెళ్లి ఉంటుందని.. ఇంత జరిగిన తర్వాత చిన్న వేడుకలా చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే తనకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందన్న ఆమె.. కాబోయే భర్త వివరాల్ని మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం.


Tags:    

Similar News