హిస్టారిక‌లా? సైన్స్ ఫిక్షనా? .. సందీప్ నెక్ట్స్..?

Update: 2020-11-09 06:45 GMT
కొన్ని క‌ల‌యిక‌లు ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తాయి. అందునా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో పాన్ ఇండియా రేంజులో సంచ‌ల‌నాలు సృష్టించిన హీరో ద‌ర్శ‌కుడు క‌లిసి ప‌ని చేస్తున్నారంటే ఒక‌టే క్యూరియాసిటీ ఉంటుంది. అలాంటి క‌ల‌యిక గురించే ఇటీవ‌ల ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది.

కేజీఎఫ్ హీరో య‌ష్ తో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా ఓ భారీ సినిమాకి ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సందీప్ వంగా ఇప్ప‌టికే అర్జున్ రెడ్డితో తెలుగులో.. అదే సినిమా రీమేక్ క‌బీర్ సింగ్ తో హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి టాప్ డైరెక్ట‌ర్ల స్లాట్ లో చేరాడు.

ప్ర‌స్తుతం ఓ హిందీ స్టార్ తో సందీప్ భారీ మూవీ చేస్తున్నారు. దీంతో పాటు క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ తోనూ పాన్ ఇండియా మూవీ చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. య‌ష్ .. మ‌హేష్‌.. ప్ర‌భాస్ లాంటి స్టార్ల‌తో ప‌ని చేయాల‌న్న‌ది అత‌డి ఆలోచ‌న‌. ఇప్ప‌టికే మ‌హేష్‌.. ప్ర‌భాస్ ల‌తో మూవీ ప్లాన్ చేసినా కానీ కుద‌ర‌లేదు. మ‌హేష్ వ‌ద్ద స్క్రిప్టు ఫైన‌ల్ చేయ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. ప్ర‌భాస్ కి వ‌రుస పాన్ ఇండియా మూవీల‌తో తీరిక లేదు. ఇక య‌ష్ కూడా కేజీఎఫ్ 2తో బిజీ బిజీ. అందువ‌ల్ల ఇవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు.

ఎట్ట‌కేల‌కు య‌ష్ కి ఓ పీరియాడిక‌ల్ లేదా హిస్టారిక‌ల్ క‌థ‌ను కానీ ఫిక్ష‌న్ క‌థ‌ను కానీ వినిపించే ప్లాన్ లో ఉన్నాడ‌న్న గుస‌గుస‌లు ఫిలింస‌ర్కిల్స్ లో వేడెక్కిస్తున్నాయి. ఇంత‌కీ అది ఏ జోన‌ర్ అన్న‌ది సందీప్ వంగా స్వ‌యంగా క‌న్ఫామ్ చేస్తే కానీ క్లారిటీ రాదు. 2021లో దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మ‌రో వైపు య‌ష్ కోసం ప‌లు అగ్ర బ్యాన‌ర్లు టాప్ డైరెక్ట‌ర్లు వెయిటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిన‌దే.
Tags:    

Similar News