'ధురంధర్' ఫ్రాంచైజీ కోసం ఎవరిని దించేస్తారో?
ఈ నేపథ్యంలోనే జమాల్ జమాలీగా నటించి తనదైన నటనతో స్పెల్ బౌండ్ చేసిన రాకేష్ బేడీ `ధురంధర్ 3`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
భారీ బడ్జెట్‌తో నిర్మించిన పాన్ ఇండియా మూవీస్‌కి దర్శకనిర్మాతలు చేసే ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయి. జక్కన్న అయితే ప్రమోషన్స్‌ని కొత్త పుంతలు తొక్కిస్తూ కోట్లు ఖర్చు చేయిస్తుంటాడు. కానీ పైసా ఖర్చు పెట్టకుండా ఎలాంటి ప్రమోసన్స్ చేయకుండా కూడా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టవచ్చని `ధురంధర్`, `ధురంధర్ 2` చిత్రాలు నిరూపించాయి. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సైలెంట్‌గా విడుదలైన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాల్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ వసూళ్లని రాబట్టి ఆశ్చర్యపరిచాయి.
ధురంధర్ రూ.1350 కోట్లు రాబట్టగా మూడు నెలల వ్యవధిలోనే విడుదలైన `ధురంధర్ 2` ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1810 కోట్ల వసూళ్లని సాధించి సరికొత్త రికార్డుకు చేరువ కాబోతోంది. త్వరలో `బాహుబలి 2` లైఫ్ టైమ్ రికార్డుని సమం చేయడానికి సిద్ధమవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు, న్యూ ఏజ్ సినిమా మేకింగ్‌కు రోల్ మోడల్‌గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలోనే `ధురంధర్ 3`పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మేజర్ ఎక్బాల్‌ని అంతం చేసిన హమ్జా ఆ తరువాత పాక్ ఐఎస్ ఐకి పట్టుబడటం, అతన్ని విడిపించడం కోసం అజయ్ సాన్యాల్ ఫోన్‌లో ఐఎస్ ఐ ఛీఫ్‌ని బెదిరించి విడిపించడం, అక్కడి నుంచి హమ్జా ప్రత్యేక విమానంలో ఇండియాకు చేరడం, జమాల్ జమాలీగా చలామనీ అవుతున్న వ్యక్తి ఇండియన్ ఏజెంట్ అని ఫైనల్‌గా ట్విస్ట్ ఇవ్వడంతో పార్ట్ 2కు ఎండ్ కార్డ్ వేశారు. అయితే ఇండియాపై పాక్ చేసిన కుట్రల చిట్టా ఇంకా మిగిలే ఉండటంతో దీనికి పార్ట్ 3 తీసే అవకాశం ఉందని సినీ ప్రియులు కామెంట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే జమాల్ జమాలీగా నటించి తనదైన నటనతో స్పెల్ బౌండ్ చేసిన రాకేష్ బేడీ `ధురంధర్ 3`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `పార్ట్ 3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. కానీ అది సాధ్యమయ్యే సని కాదు. `ధురంధర్` అనేది ఫ్రాంచైజీ. వేరు వేరు నటులతో దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు` అని `ధురంధర్`పై క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు ఆదిత్యధర్‌పై కూడా `ధురంధర్ 3`పై ఒత్తిడి ఆదిత్యపై పెరుగుతోంది. అయితే డైరెక్టర్ మాత్రం దీన్ని కొనసాగించకుండా ఓ ఫ్రాంచైజీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తారు ఎవరైనా కానీ ఆదిత్యధర్ మాత్రం ఆ పని చేయడానికి ఇష్టపడకపోవడంతో కొంత మంది మేకర్స్ ఇంత పిచ్చిగా ఆలోచిస్తున్నాడేంటీ? అని వాపోతున్నారట. ఇక ఆదిత్యధర్ తాజా నిర్ణయంతో `ధురంధర్` ఫ్యాన్స్ ఖుషీ ఫీలవుతున్నారు. అదేంటంటే ధురంధర్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ వేరే హీరో, వేరే నటులతో చేయాలని భావిస్తున్నాడట. అంటే `ధురంధర్`గా రణ్‌వీర్ కాకుండా మరో హీరో ఈ ఫ్రాంచైజీలోకి వచ్చేస్తాడన్నమాట. బయట జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ ఫ్రాంచైజీలోకి విక్కీ కౌశల్ ఎంట్రీ ఇస్తాడని, గతంలో ఆదిత్యధర్‌తో `ఉరి` చేశాడు కాబట్టి తనకే ఎక్కువ ఆవకాశం ఉందని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. మరి ఆదిత్యధర్ మైండ్‌లో ఏముందో తెలియాలంటే తను స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.