• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సందీప్ కిషన్.. అలా బిజీగా...

సందీప్ కిషన్.. అలా బిజీగా ఉన్నాడట!

By - Tupaki Desk
Update: 2019-11-13 16:21 GMT
గతంతో పోలిస్తే సందీప్ కిషన్ ఊపు ఇప్పుడు తగ్గింది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా కు ముందు, తర్వాత ఈ హీరో మంచి ఊపు మీద కనిపించాడు. అయితే కొన్ని ఫ్లాపుల తో ఇతడు వెనుకబడ్డాడు. ఇటీవలే ఒక హారర్ సినిమాతో సందీఫ్ మళ్లీ ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.

ఈ ఉత్సాహం తో 'తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ' గా రాబోతున్నాడు ఈ హీరో. ఈ వారంలోనే ఆ సినిమా విడుదల కానుంది. ఇలాంటి నేపథ్యం తో తన చేతిలో ఉన్న ప్రాజెక్టు ల గురించి సందీప్ చెప్పాడు.

ఇటీవలే  హిందీ వెబ్ సీరిస్ 'ఫ్యామిలీ మ్యాన్' లో నటించినట్టుగా చెప్పాడు. అందులో తొలి పార్టు తో తను నటించానని, రెండో పార్టు లో తను ఉండబోవడం లేదని, మూడో పార్టు లో నటించబోతున్నట్టు గా సందీప్ చెప్పాడు. అలాగే తమిళం లో మూడు సినిమాలు తనవి విడుదల కు రెడీగా ఉన్నాయని చెప్పాడు.

తనకు పలు వెబ్ సీరిస్ లలో నటించమని అవకాశాలు వస్తున్నట్టుగా, అయితే ఇప్పుడు తెలుగులో సినిమాలు చేసే ఆసక్తి తో ఉన్నట్టుగా చెప్పాడు ఈ హీరో. తమిళం లో మూడు సినిమాలూ విడుదల అయ్యాకా కొత్త సినిమాల కు ఓకే చేయనున్నట్టు గా చెప్పాడు.

ఏతా వాతా తను అవకాశాలతో బిజీగానే ఉన్నట్టు గా ఈ హీరో చెప్పాడు. 'తెనాలి రామకృష్ణ' సందీప్ కు తెలుగు లో చాలా కీలకమైన సినిమానే అవుతోంది. ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఆకట్టుకుంటే ఇతడు మళ్లీ మంచి ఫామ్ లోకి వచ్చినట్టే.
Tags:    
  • Sandeep Kishan 
  • Venkatadri Express 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tenali Rama Krishna 
  • Tupaki News 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS