• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మళ్లీ అదే న్యూస్ .....

మళ్లీ అదే న్యూస్ .. మిస్టర్ బీన్ చనిపోయాడు , అసలు సంగతేమిటంటే

By - Tupaki Desk
Update: 2021-11-24 09:30 GMT
ఒక్కటంటే ఒక్క డైలాగ్ లేకుండా స్లాప్ స్టిక్ కామెడీ తో తన మైమ్ యాక్టింగ్తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు బ్రిటిష్‌ నటుడు రోవాన్ అట్కిన్సన్. తన అద్భుతమైన నటనతో ‘మిస్టర్ బీన్’ పాత్రను ఒక ఐకానిక్ క్యారెక్టర్‌ గా తీర్చిదిద్దిన ఆయన అభిమానుల మదిలో నవ్వుల రారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తరువాత క్రమంగా ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీంతో రోవాన్ అట్కిన్సన్ ను అందరూ మిస్టర్ బీన్ అని పిలవడం విశేషం.

బ్రిటిష్ నటుడు రోవాన్ అట్కిన్సన్ ఇక లేరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మిస్టర్ బీన్’గా ప్రపంచానికి బాగా దగ్గరైన రోవాన్ చనిపోయాడంటూ ఓ ప్రసిద్ధ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రసారం చేయ‌గా, ఈ వార్త చూసిన ఆయన అభిమానులు కలత చెందారు. రోవాన్ అట్కిన్సన్ చనిపోయాడని నిజంగానే భావించి కొంతమంది RIP మిస్టర్ బీన్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. కానీ ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తెలిసి మండిప‌డ్డారు. 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఈ ఏడాది మేలో కూడా ఆయన మరణించారంటూ ఫేక్‌ వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చాయి.

ఇలా ఏటా అసత్యపు వార్తలు రావడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రొవాన్‌ అట్కిన్సన్ ప్రతి సంవత్సరం ఎందుకు చనిపోతాడు’, ‘మా నవ్వుల రారాజు నిక్షేపంగా ఉన్నారు’ అని మిస్టర్‌ బీన్‌ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మిస్టర్ బీన్ ఫేస్‌బుక్ పేజీ ప్రపంచంలో అత్యధికంగా లైక్ చేయబడిన పేజీలలో 10వ స్థానంలో ఉందంటే మిస్టర్ బీన్ పాత్రకు ఉన్న ప్రజాదరణ ఎంత అనేది అంచనా వేయవచ్చు.ప్రస్తుతం రోవిన్ అట్కిన్సన్ ప్రముఖ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్‌’లో హిట్లర్ పాత్రను పోషించబోతున్నాడు.
Tags:    
  • Mr Bean 
  • Rowan Atkinson 
  • Mr Bean movies 
  • Mr Bean comdey 
  • social media 
  • rip 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS