లేడీ సూపర్‌ స్టార్‌ మూవీ సీక్వెల్‌ లో సమంత?

Update: 2019-07-07 11:49 GMT
సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ గా నయనతార పేరు దక్కించుకుంది. వరుసగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు.. హీరోల సరసన కమర్షియల్‌ పాత్రలు చేస్తూ సౌత్‌ లోనే అత్యధిక క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు పెట్టింది పేరైన నయనతార రెండేళ్ల క్రితం నటించిన చిత్రం 'అరామ్‌'. ఆ చిత్రంలో నయన్‌ లేడీ కలెక్టర్‌ పాత్రలో కనిపించింది. ఒక పేదింటి చిన్నారి బోరు బావిలో పడ్డ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి బయటకు తీసే కలెక్టర్‌ పాత్రలో నయన్‌ కనిపించింది.

గోపీ నైనార్‌ దర్శకత్వంలో రూపొందిన 'అరామ్‌' చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ ను చేసే ఉద్దేశ్యంలో దర్శకుడు గోపీ నైనార్‌ ఉన్నాడు. ఆ కథకు సీక్వెల్‌ కాకున్నా 'అరామ్‌' సీక్వెన్స్‌ అన్నట్లుగా గోపీ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే స్టోరీ లైన్‌ కూడా సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. సీక్వెల్‌ కోసం నయన్‌ ను సంప్రదించగా ఆమె రెండేళ్ల వరకు ఖాళీ లేదని చెప్పిందట.

నయన్‌ కోసం రెండేళ్లు ఎదురు చూడటం ఇష్టం లేని గోపీ నైనార్‌ మరో హీరోయిన్‌ తో 'అరామ్‌ 2' చేయాలని నిర్ణయించుకున్నాడట. పలువురు హీరోయిన్స్‌ ను పరిశీలించిన తర్వాత ఆయన దృష్టి సమంత వద్ద వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చిత్రాల్లో చేయగల సత్తా ఉన్న సమంత 'అరామ్‌' వంటి సీరియస్‌ సినిమాలో ఎలా నటిస్తుందో అనే అనుమానం కొందరిలో వ్యక్తం అవుతుంది. ఇంకా కన్ఫర్మ్‌ అయితే కాలేదు కాని గోపీ ముందు సమంత తప్ప మరే ఆప్షన్‌ ఉన్నట్లుగా లేదు. మరి సమంత 'అరామ్‌ 2'కు ఒప్పుకుంటుందా చూడాలి.
Tags:    

Similar News