సంగీత్ శోభన్ రెమ్యూనరేషన్.. అదే అసలు కారణమా?
టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సంగీత్ శోభన్ మరోసారి వార్తల్లో నిలిచారు.;
టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సంగీత్ శోభన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓటీటీ కంటెంట్ తో కెరీర్ ప్రారంభించిన ఆయన.. తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. ముఖ్యంగా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, ది బేకర్ అండ్ ది బ్యూటీ వంటి వెబ్ సిరీసులతో ప్రేక్షకులకు దగ్గరైన సంగీత్, తర్వాత మ్యాడ్ సినిమాతో భారీగా పాపులర్ అయ్యారు.
మ్యాడ్ చిత్రంలో దామోదర్ (డిడి) పాత్రలో సంగీత్ శోభన్ చూపిన ఎనర్జీ, టైమింగ్, కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో కథ సెకండాఫ్ ఎక్కువగా సంగీత్ పాత్ర చుట్టూనే తిరగడం కూడా ఆయనకు ప్లస్ అయ్యింది. దీంతో ఆ మూవీని చాలా మంది వన్ మాన్ షోగా అభివర్ణించారు. అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ వచ్చిన మ్యాడ్ స్క్వేర్ లో కూడా సంగీత్ కామెడీ హైలైట్ గా నిలిచింది.
కామెడీ టైమింగ్ అనేది అంత ఈజీ కాదు. అది సరిగ్గా కుదిరితే నటుడికి మంచి అవకాశాలు వస్తాయి. సంగీత్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయనపై దర్శక నిర్మాతల్లో నమ్మకం పెరిగిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే అదే సమయంలో రెమ్యూనరేషన్ విషయమై చర్చలు ఎక్కువయ్యాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, మ్యాడ్ స్క్వేర్ కు ముందు రూ.70 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారట సంగీత్.
కొన్ని ప్రాజెక్టులకు రూ.70–75 లక్షల మధ్య సెటిల్ అయ్యారని తెలుస్తోంది. కానీ మ్యాడ్ స్క్వేర్ హిట్ తర్వాత ఆయన తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన ఒక్క సినిమాకు సుమారు రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్. దీంతో పలువురు దర్శక నిర్మాతలు ఆశ్చర్యానికి గురవుతున్నారని సమాచారం.
అయితే సంగీత్ తన డిమాండ్ కు అసలు కారణంగా తన మార్కెట్, క్రేజ్, అలాగే ప్రమోషన్లలో తన టాలెంట్ చూపిస్తున్నారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, ఇన్ఫ్లుయెన్సర్లతో ఇంటరాక్షన్, ప్రెస్ మీట్లు, మీడియా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొనడం వంటి విషయాల్లో సంగీత్ ముందుంటారనే పేరుంది. ఇప్పుడు ఏకంగా తన అప్ కమింగ్ మూవీ రాకాసకు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఆ సినిమాను సంగీత్ శోభన్.. మ్యాడ్ స్క్వేర్ కు ముందే కమిట్ అయ్యారని తెలుస్తోంది. సుమారు రూ.2.7 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో వినికిడి. ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటే, సంగీత్ తన తదుపరి ప్రాజెక్ట్ల కోసం రెమ్యూనరేషన్‌ను మరింత పెంచే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. అదే విషయంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు.