ఫోటో స్టోరి: ముత్యాల మ‌ధ్య‌ మంచి ముత్యం కియ‌రా

శ‌రీర‌మంతా ముత్యాల అల్లిక‌తో తీర్చిదిద్దిన తెలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోతోంది.;

Update: 2026-03-28 04:20 GMT

స్టైల్ ఐకాన్ కియారా అద్వానీ తాజాగా గ్రాజియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ లుక్ లో మెరిపిసోయింది. శ‌రీర‌మంతా ముత్యాల అల్లిక‌తో తీర్చిదిద్దిన తెలుపు రంగు డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోతోంది. నిన్న జరిగిన అవార్డుల వేడుకలో తన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన కియారా.. ఇప్పుడు ఈ సరికొత్త లుక్‌తో మరోసారి నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ రూపొందించిన ఈ ప్రత్యేకమైన వైట్ అండ్ వైట్ డ్రెస్సులో కియారా ఒక అందమైన శ్వేత వర్ణపు అప్సరసలా కనిపిస్తోంది.

 

ఈ డిజైనర్ వేర్‌లో కియారా ధరించిన బ్రాలెట్.. రఫుల్డ్ ట్యూనిక్ బ్లౌజ్ .. పూసల అల్లికతో కూడిన ట్రౌజర్స్ త‌న‌కు ఒక రాయల్ లుక్‌ను ఇచ్చాయి. ముఖ్యంగా డ్రెస్ మొత్తం ముత్యాల వంటి పూసల అల్లికతో ఎంతో ముగ్ధమనోహరంగా ఉంది. టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ థీమ్‌లో కియారా తన అందంతో అభిమానుల మనసు దోచుకుంటోంది. ఈ ఫోటోషూట్‌లో కియ‌రా మేకప్, హెయిర్ స్టైల్ కూడా ఈ డ్రెస్సుకి తగ్గట్టుగా ఎంతో పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.

 

కేవలం దుస్తులే కాకుండా ఆభరణాలు కూడా ఈ లుక్‌కి మరింత గ్లామర్‌ను అద్దాయి. మీరారీ జువెల్స్ నుండి `ఇన్సిగ్నియా` ఇయర్ రింగ్స్‌తో పాటు జాంబియన్ ఎమరాల్డ్, బ్రెజిలియన్ సిట్రిన్ కలిసిన 18 క్యారెట్ల బంగారు దుద్దులను కియారా ధరించింది. అలాగే అజ్గా బ్రాండ్‌కు చెందిన గోల్డ్ ప్లేటెడ్ రింగ్ త‌న‌ వేలికి మరింత అందాన్ని తెచ్చింది. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త వహించి ఈ కవర్ పేజీ షూట్‌ను ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కియారా.. ఈ ముత్యాల అల్లిక డ్రెస్సులో `మంచి ముత్యం`లా మెరిసిపోతూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కియారా స్టైల్‌కు ఫిదా అవుతున్నారు. ఒకవైపు తన నటనతో.. మరోవైపు తన అదిరిపోయే ఫ్యాషన్ ఛాయిస్‌లతో కియారా 2026లో తన జోరును కొనసాగిస్తోంది.

గీతూ మోహన్ దాస్ `టాక్సిక్`లో కియారా పాత్ర:

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న `టాక్సిక్` సినిమాలో కియారా అద్వానీ `నాడియా` అనే పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర గురించి గీతూ మాట్లాడుతూ.. నాడియా పాత్రలో ఒకవైపు సున్నితత్వం .. మరోవైపు తీవ్రత రెండూ సమానంగా ఉంటాయని..అందుకే ఈ పాత్రకు కియారా తప్ప మరెవరూ సెట్ అవ్వరని తాను ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కియారా స్క్రీన్ ప్రెజెన్స్‌లో ఒక ఘాఢ‌మైన‌ మానవీయ కోణం కనిపిస్తుందని.. ఆమెను ఈ పాత్ర కోసం ఎంచుకోవడం కేవలం లాజిక్ కాదని.. అది ఒక బలమైన భావోద్వేగమని గీతూ వెల్లడించారు.

సినిమా విష‌యంలో కియ‌రా క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త‌పైనా ప్ర‌శంస‌లు కురిపించారు గీతూ.. టాక్సిక్ తో పాన్ ఇండియ‌న్ స్టార్ గా కియ‌రా మ‌రో స్థాయిని అందుకుంటుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

Tags:    

Similar News