పెళ్లయిన వారికి ఇవ్వాలంటున్న సమంత

Update: 2018-04-10 05:39 GMT
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం ఉండాలి. క్రియేటివ్ జాబ్ లో ఎంత కష్టపడినా అవకాశాలు ఎక్కువగా రాకపోవచ్చు. కోట్లతో కూడుకున్న సినిమా కావున దర్శకుడు నిర్మాత లకు నచ్చిన వారికే అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు. కానీ కొన్ని అపోహల కారణంగా కొన్ని పద్ధతుల వల్ల దర్శక నిర్మాతల ఆలోచనలు ఇంకా మారడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి జరిగితే ఆమె హీరోయిన్ గా చేస్తే వర్కౌట్ కాదని ఆడియేన్స్ చూడరనే అపోహ ఉంది.

గతంలో కొన్ని సార్లు అలా జరిగినప్పటికీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేక్షకుల ఆలోచన ధోరణి మారింది. అందుకు ఉదాహరణగా సమంతను చెప్పుకోవచ్చు. రంగస్థలం సినిమాలో రామలక్ష్మిగా సమంత నటన ఎంతగా ఆకట్టుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సమంత రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి అయిపోయిన హీరోయిన్స్ కి కూడా అవకాశాలను ఇవ్వాలనే విషయంపై స్పందించింది. సమంత మాట్లాడుతూ.. మొన్నటి వరకు సక్సెస్ లో ఉన్న హీరోయిన్‌ కి సడన్ గా పెళ్లి జరిగితే ఆమె చేసిన  సినిమాలు ఇక ప్రేక్షకులు చూడరు అని ఫిల్మ్ మేకర్స్ ఫిక్స్ అయిపోయారు.

అది వారి ఆలోచన మాత్రమే కానీ ప్రేక్షకులు అలా కాదు. సమంత పెళ్లి అయ్యింది కదా అని ఎవరు ఆమె సినిమా చూడమని చెప్పలేదు. రంగస్థలం ఒక కమర్షియల్ మూవీ. నా క్యారెక్టర్ ను అందరు యాక్సెప్ట్ చేశారు. ఆడియెన్స్ ఒకే చేశారు అంటే ఫిల్మ్ మేకర్స్ కి మెస్సేజ్ ఇచ్చినట్టే అని సమంత తన స్టైల్ లో వివరించింది. ఇక తనకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తోంది మాత్రం రెండు కుటుంబాలని సమంత చెప్పింది. అక్కినేని - దగ్గుబాటి ఫ్యామిలీల సపోర్ట్ వల్లే 200% వర్క్ మీద ఫ్రీ మైండ్‌ తో వెళుతున్నానంటు తెలిపింది.


Tags:    

Similar News