మీడియా మీద సమంత సెటైర్..!

Update: 2021-09-01 11:30 GMT
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని గత కొంతకాలంగా ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో నటించి తమిళుల ట్రోల్స్ ఎదుర్కొంది. అలానే తన సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్ నేమ్ చేంజ్ చేసి మీడియాకి సోషల్ మీడియాకి కావాల్సినంత పని చెప్పింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. అయినప్పటికీ దీనిపై ఏమాత్రం స్పందించను అని చెబుతూ వ్యూహాత్మక నిశ్శబ్దం పాటిస్తోంది. రూమర్స్ ని ఎంజాయ్ చేస్తూ.. తన ఫ్రెండ్స్ తో కలిసి మాస్ సూన్ లో చిల్ అవుతోంది.

అయితే అప్పుడప్పుడు పరోక్షంగా తనని విమర్శించే వారిపై సెటైర్స్ కూడా వేస్తోంది సామ్. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత.. ఈసారి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మీడియాపై సెటైర్ వేసింది. దీని కోసం తనకు ఎంతో ఇష్టమైన డాగ్స్ సహాయం తీసుకుంది. అసలు మ్యాటర్ ఒకటైతే మీడియా మరోలా వక్రీకరించి చూపిస్తుందని చెప్పడానికి ప్రయత్నించింది. తాజాగా సామ్ ఒక కుక్క ఫోటో ఉన్న పోస్ట్ ని షేర్ చేసింది. ఇందులో మీడియా అనేది ఒక కుక్కని వైల్డ్ టీత్ తో అత్యంత ప్రమాదకరమైనదిగా చూపిస్తుందని.. నిజానికి ఆ కుక్కలు చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటాయనే సందేశాన్ని ఇస్తోంది.

ఇది తన వ్యక్తిగత జీవితం విషయంలో రియాలిటీలో జరుగుతున్న దాన్ని.. మీడియా వక్రీకరించి చూపిస్తోందని సమంత పరోక్షంగా సెటైర్ వేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఇంతకముందు ట్రోల్స్ ని పట్టించుకొద్దంటూ ఓ రచయిత పోస్ట్ చేసిన కొటేషన్ ను సామ్ ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ట్రోల్స్ పై స్పందించడం కంటే వాటిని ఇగ్నోర్ చేయడం మంచిదని దీని ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది.

ఏదేమైనా సమంత తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై ఇలా పరోక్షంగా స్పందించే కంటే.. దీనిపై వెంటనే క్లారిటీ ఇచ్చి వార్తలకు చెక్ పెడితే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'శాకుంతలం' షూటింగ్ పూర్తి చేసిన సామ్.. ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి - నయనతార ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


Tags:    

Similar News