విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి నోరు విప్పిన సమంత..!
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల తన భర్త అక్కినేని నాగ చైతన్యతో నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చై-సామ్ విడాకుల ప్రకటన వెనుక బలమైన కారణం ఏంటని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక రూమర్స్ వచ్చాయి.
విడాకుల వ్యవహారం మీద చైతన్య - సమంత ఇప్పటి వరకు నేరుగా స్పందించలేదు. చై ఎప్పటిలాగే సైలెంట్ గా తన పని చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్న సామ్.. అమ్మ చెప్పింది పేరుతో నిఘాడ అర్థాన్నిచే సూక్తులను షేర్ చేస్తూ వస్తోంది. మధ్యలో ఒకసారి తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ ను ఖండిస్తూ ట్వీట్ చేసింది.
తన వ్యక్తిగత జీవితంలో జరిగిన చోటుచేసుకున్న పరిణామాలపై ఇప్పటి వరకు నోరు విప్పని సమంత.. ఇప్పుడు ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖలు చేసినట్లు తెలుస్తోంది. ''2021లో జరిగిన అన్ని వ్యక్తిగత విషయాల తర్వాత, నాకు ఎలాంటి అంచనాలు లేవు. నేను జాగ్రత్తగా వేసుకున్న ప్లాన్స్ అన్నీ కుప్పకూలాయి'' అని సమంతా చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.
నాగ చైతన్యతో తన వైవాహిక జీవితంలో చాలా ప్లాన్స్ వేసుకున్నానని.. అయితే ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత అవన్నీ కూలిపోయాయని సమంత అభిప్రాయ పడుతున్నట్లు స్పష్టంగా సూచిస్తుంది. అదే సమయంలో విడాకుల ప్రకటన తర్వాత తనపై వస్తున్న ట్రోలింగ్ పై ELLE మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడింది.
''నేను షరతులు లేని అంగీకారాన్ని డిమాండ్ చేయను. డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగి ఉండమని నేను అందరినీ ప్రోత్సహిస్తాను. అయితే మనం ఒకరినొకరం ప్రేమించుకోవచ్చు మరియు కరుణించవచ్చు. కాకపోతే వారి నిరాశను మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని అభ్యర్థిస్తాను'' అని సమంత వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉండగా సమంత కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. రెండు ద్విభాషా చిత్రాలతో పాటుగా ఓ ఇంటర్నేషనల్ మూవీ కూడా అనౌన్స్ చేసింది. అలానే 'పుష్ప' సినిమా కోసం తొలిసారిగా ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధపడింది సామ్. ఈ క్రమంలో 'యశోద' అనే పాన్ ఇండియా చిత్రాన్ని ప్రారంభించింది.
ఇక త్వరలోనే తన ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని ప్రకటించనుంది. ఏదేమైనా తన వ్యక్తిగత జీవితం విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్న సమంత.. ఆ ప్రభావం తన కెరీర్ మీద పడకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.