వయసుకు మించిన పాత్రల్లో అందాల భామ‌లు

దక్షిణాది చిత్ర పరిశ్రమలో గాలి మారుతోంది. ఒకప్పుడు హీరోయిన్ అనగానే కేవలం అందం, డాన్సులు, పది పదిహేను సంవత్సరాల కెరీర్ అని మాత్రమే భావించేవారు.

Update: 2026-06-30 22:30 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమలో గాలి మారుతోంది. ఒకప్పుడు హీరోయిన్ అనగానే కేవలం అందం, డాన్సులు, పది పదిహేను సంవత్సరాల కెరీర్ అని మాత్రమే భావించేవారు. కానీ ఇప్పుడా దృశ్యం మారుతోంది. ఇరవై ఏళ్ల వయసులోనే నలభై ఏళ్ల పరిపక్వతను తెరపై ఆవిష్కరిస్తూ టీనేజ్ పిల్లలకు తల్లీగా నటిస్తూ యువతరం హీరోయిన్లు సంచలనం సృష్టిస్తున్నారు. ఇది కేవలం ఒక పాత్రను చేయడం మాత్రమే కాదు. నటిగా తమ పరిధిని విస్తరించుకోవడంలో వారు చేస్తున్న ఓ ప్రయోగం గా చెప్పొచ్చు. శ్రీనిధి శెట్టి నుంచి మృణాల్ ఠాకూర్ వరకు చూస్తే.. వీరు కేవలం గ్లామర్ బొమ్మలుగా మిగిలిపోవడానికి ఇష్టపడటం లేదు.

కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో వయసుతో సంబంధం లేని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఒక సాధారణ కమర్షియల్ సినిమాలో హీరో పక్కన ఉండే పాత్ర కంటే భారం పంచుకునే తల్లి పాత్రను లేదా జీవిత అనుభవాలు కలిగిన పరిణతి చెందిన స్త్రీ పాత్రను ఎంచుకోవడం వెనుక, అభినయం పట్ల వారికున్న దాహం కనిపిస్తోంది. ఇది నటిగా వారికి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది. ప్రేక్షకుల ఆలోచనల్లో వ‌స్తోన్న‌ మార్పు కూడా దీనికి ప్రధాన కారణం. తాజాగా మల్టీప్లెక్స్ ప్రేక్షకుల నుండి సాధారణ అభిమానుల వరకు అందరూ కంటెంట్‌ను నమ్ముతున్నారు.

స్క్రీన్ మీద హీరోయిన్ వయసు కన్నా? ఆమె పలికించే భావోద్వేగాలు ఎంత సహజంగా ఉన్నాయనేదే కీలకం. ఈ విషయంలో నేటి తరం హీరోయిన్లు బామ్మ పాత్రను కూడా అత్యంత సహజంగా చేయగలమని నిరూపిస్తున్నారు. పాత్రకు తగినట్టుగా తనను తాను మలుచుకోవడంలో వారు చూపుతున్న ఆసక్తి సినిమా ప్రమాణాలను పెంచుతోంది.

చాలా మంది విశ్లేషకులు ఇలాంటి పాత్రల వల్ల కెరీర్ భవిష్యత్తుపై ప్రభావం ఉంటుందని అనుకోవచ్చు. కానీ ఈ నటీమణులు దాన్ని రిస్క్ గా చూడటం లేదు. గ్లామర్ ఇమేజ్ అనేది కాలంతో పాటు మసకబారుతుంది.

కానీ నటిగా లభించే గుర్తింపు తరతరాల పాటు నిలిచి ఉంటుంది. బలమైన క్యారెక్టర్ ద్వారా సంపాదించే పేరు ఏ గ్లామర్ పాత్ర కూడా ఇవ్వలేదు. అందుకే తక్కువ సినిమాల్లో నటించినా? గుర్తుండిపోయే పాత్రలను ఎంచు కోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమా నిర్మాణంలో వ‌స్తోన్న సాంకేతిక మార్పులు కూడా వీరికి తోడవుతు న్నాయి. కెమెరా పనితనం, మేకప్, లైటింగ్ వంటి అంశాలు నటీమణులను ఏ వయసులోనైనా చాలా సహజంగా చూపించగలుగుతున్నాయి.

ఫలితంగా కథలో నిడివి ఎంత ఉన్నా? అది ఎంతవరకు లోతైన భావోద్వేగాలను పంచుతుందనే దానికే వారు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు వల్ల కథల్లో వైవిధ్యం పెరుగుతుంది. ప్రేక్షకులపై కూడా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పాత్రల ఎంపికలో నవతరం హీరోయిన్లు ప్రదర్శిస్తున్న ధైర్యం సినిమాకు కొత్త ఊపిరి పోస్తోంది. వారు చేస్తున్న ఈ ప్రయోగాలు రేపటి తరం నటీమణులకు రోల్ మోడల్ లా మారుతున్నాయి. ఏ పాత్రనైనా తమ ప్రతిభతో పండిం చగలమన్న నమ్మకం వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. గ్లామర్ తాత్కాలికం. ప్రతిభ శాశ్వతం అని ఈ భామ‌లు నిరూపిస్తున్నారు.

Tags:    

Similar News