సత్యదేవ్ 'రావు బహదూర్' ట్రైలర్.. మహేష్ వాయిస్‌ తో అసలైన కిక్కు..

సినిమా ట్రైలర్‌ కు ఓ స్టార్ హీరో వాయిస్‌ ఓవర్ యాడ్ అయితే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో రావు బహదూర్ మరోసారి చూపించింది.

Update: 2026-06-30 18:49 GMT

సినిమా ట్రైలర్‌ కు ఓ స్టార్ హీరో వాయిస్‌ ఓవర్ యాడ్ అయితే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో రావు బహదూర్ మరోసారి చూపించింది. సూపర్ స్టార్ మహేష్‌ బాబు వాయిస్‌ తో ప్రారంభమైన ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సత్యదేవ్ లీడ్ రోల్ లో వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఆ సైకలాజికల్ థ్రిల్లర్ జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లింది.

ట్రైలర్ ప్రారంభంలోనే మహేష్‌ మాటలు ఆకట్టుకుంటాయి. "ఇక్కడ మ్యాజిక్ అంటే గారడీ కాదు.. దృశ్య కావ్యం" అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సినిమాపై ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తుంది. ఆ తర్వాత వచ్చే వాయిస్‌ ఓవర్‌ లో అనుమానం చుట్టూనే స్టోరీ అంతా తిరుగుతుందనే ఇన్ డైరెక్ట్ గా రివీల్ చేశారు. ఒక చిన్న అనుమానం ఎలా మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందో, అతని ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుందో ట్రైలర్ చూపించింది.

నార్మల్ కమర్షియల్ ట్రైలర్లలా కాకుండా, రావు బహదూర్ విషయంలో దర్శకుడు వెంకటేష్ భిన్నంగా రూపొందించారు. కథ మొత్తాన్ని బయటపెట్టకుండా, ప్రేక్షకుల్లో ప్రశ్నలు రేకెత్తించేలా ప్రతి సీన్ ను కట్ చేశారు. దీంతో సినిమా అసలు కథ ఏమిటి? సత్యదేవ్ పాత్రలో ఉన్న మిస్టరీ ఏమిటి? అనే ఆసక్తి సహజంగానే పెరుగుతోంది. ట్రైలర్‌ లో కనిపించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా నిలిచాయి.

ప్రతి ఫ్రేమ్‌ లో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. కథలో సైకలాజికల్ ఎలిమెంట్స్‌ తో పాటు మ్యాజిక్, మిస్టరీ, ఎమోషన్స్ కలిపి దర్శకుడు కొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అందుకే సినిమాను మహేష్‌ బాబు దృశ్య కావ్యంగా ఎక్స్పైన్ చేయడం విశేషం. సత్యదేవ్ కూడా తన పాత్రతో ఆకట్టుకున్నారు. ఎమోషన్స్, అయోమయం, భయం, అనుమానం వంటి ఫీలింగ్స్ ను ఆయన ఎక్స్ప్రెషన్స్ ద్వారా చూపించిన తీరు ఆసక్తి కలిగిస్తోంది.

కథ మొత్తం సత్యదేవ్ రోల్ చుట్టూనే తిరిగేలా కనిపిస్తుండటంతో నటుడిగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం దక్కినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే విభిన్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా మరోసారి కొత్త తరహా కథను ఎంచుకున్నారని ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. కమర్షియల్ ఫార్ములాకు దూరంగా, ఆలోచింపజేసే కథనంతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది.

సినిమాలో సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించగా, మహేష్‌ బాబు సమర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రైలర్ కథను పూర్తిగా చెప్పకుండా, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. అందుకు మహేష్‌ వాయిస్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరి మూవీ ఎలా ఉంటుందో చూడాలి.


Full View


Tags:    

Similar News