పవర్ స్టార్ సినిమాను రిజెక్ట్ చేసిందా?

Update: 2019-12-15 01:30 GMT
సమంతా అక్కినేని ఈమధ్య తన కథల ఎంపికలో.. సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహిస్తోంది.  సమంతాకుకు క్రేజీ ఆఫర్లు వస్తున్నప్పటికీ అన్నిటికీ యస్ చెప్పడం లేదు.  కొద్దిరోజుల క్రితం 'U టర్న్' సినిమా హిందీ రీమేక్ కు సమంతా నో చెప్పిందని వార్తలు వచ్చాయి.  బాలీవుడ్ ఆఫర్ ను కూడా సమంతా తిరస్కరించడం ఒక హాట్ టాపిక్ అయింది.

ఇదిలా ఉంటే తాజాగా అంతకంటే క్రేజీగా ఉండే మరో ఆఫర్ ను సమంతా ఒప్పుకోలేదని సమాచారం.  బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'పింక్' ను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు.  హిందీ వెర్షన్ లో తాప్సీ పోషించిన పాత్ర కోసం మొదట సమంతానే సంప్రదించారట.  అయితే సమంతా ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.  ఇప్పటికే వరసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నానని.. ఈ సమయంలో మరో సీరియస్ ఫిలిం చేయలేనని సమంతా చెప్పినట్టు సమాచారం.

ఏదేమైనా అతి తక్కువ గ్యాప్ లో సమంతా రెండు క్రేజీ ప్రాజెక్టులకు నో చెప్పడం ఆశ్చర్యకరమైన విషయమే.  ఇదిలా ఉంటే సమంతా ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే నెట్ ఫ్లిక్స్ ఫిలింలో నటిస్తోంది. 
Tags:    

Similar News