పవర్‌ స్టార్‌ పై సమంత ఫైర్‌ అవుద్దా?

Update: 2016-02-06 15:30 GMT
కోలీవుడ్ పవర్‌ స్టార్ విజయ్ నటించిన తెరి టీజర్ రిలీజ్ అయింది. విడుదలైన గంటల వ్యవధిలోనే వ్యూస్ - లైక్స్ విషయంలో పాత రికార్డులన్నింటినీ తెరి తిరగరాసేసింది. కానీ ఈ టీజర్ లో గమనించాల్సిన విషయం ఏంటంటే.. అసలు హీరోయిన్స్ ని మచ్చుకైనా మొహం చూపించకపోవడం. తెరిలో సమంత - అమీజాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయినా సరే, యాభై సెకన్ల టీజర్ లో ఒక్క ఫ్రేమ్ లో అయినా, ఒక్క హీరోయిన్ ని అయినా చూపించలేదు. టీజర్ లో అన్నీ విజయ్ పై మాత్రమే షాట్స్ కట్ చేశారు. టీజర్ ఆకట్టుకునేలానే ఉన్నా.. అసలు హీరోయిన్లను చూపించకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. దీనిపై సమంత నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోఅనే ఆసక్తి నెలకొంది. శామ్స్ గురించే ఇలా ఆలోచించడానికి కారణం.. గతంలో అంజాన్ విషయంలో సమంత చేసిన కామెంట్స్ - ట్వీట్స్. సూర్య మూవీ అంజాన్(తెలుగులో సికందర్) ఫస్ట్ లుక్ ఇచ్చినపుడు హీరోయిన్ ఫోటో వేయకపోవడంపై సమంత గుర్రుమంది.

ఇండస్ట్రీలో అంతా మగ పెత్తనమే అనీ, కనీసం ఫోటో కూడా వేయలేదంటూ నానా హంగామా చేసింది. ఇప్పుడు కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే. ఇద్దరు హీరోయిన్లను మొహం కూడా చూపించకుండా దాచేశారు. మరి ఇందులో డైరెక్టర్ ఉద్దేశ్యమేంటో కానీ.. సమంత నుంచి రాబోయే రియాక్షన్ పై మాత్రం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తను చెప్పే మాటలను చాలా ప్లాన్డ్ గా చెప్పే. శామ్స్.. ఇప్పటికే ఈ విషయంపై ప్రిపేర్ కూడా అవుతోందట.
Tags:    

Similar News