రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి స‌మంత‌!

Update: 2022-12-23 05:42 GMT
స్టార్ హీరోయిన్ స‌మంత అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో అన్నిరకాల   షూటింగ్ లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే 'ఖుషీ'  షూటింగ్ స‌మంత సెట్స్ కు వ‌స్తే త‌ప్ప  ముంద‌కెళ్ల‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ఇత‌ర న‌టీన‌టుల పై సీన్స అన్ని పూర్త‌య్యాయి. స‌మంత పై స‌న్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయ‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఖుషీ టీమ్   ఆమె వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయ‌డం త‌ప్ప  చేసేదేం?  లేదు.  అలాగే బాలీవుడ్ షూటింగ్ లు  డిలే అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌మంత పై నెట్టింట ప్ర‌చారం ప‌తాక స్థాయికి చేరుతోంది.

సామ్ షూటింగ్ కి వెళ్ల‌క‌పోవ‌డంతో బాలీవుడ్ సినిమాలు అమెను త‌ప్పిస్తున్నాయని..కొత్త హీరోయిన్ల  కోసం యూనిట్లు  అన్వేష‌ణ చేస్తున్న‌ట్లు బాలీవుడ్  మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

ఇదే కోవ‌లో 'ఖుషీ' టీమ్ సైంత మ‌రికొన్ని రోజులు వెయిట్ చేసి చివ‌రిగా హీరోయిన్ తీసుకునే దిశ‌గా నిర్ణ‌యం తీసుకున్నా? ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని  వినిపిస్తుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా స‌మంత రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ కి స‌న్నదం అవుతున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలుస్తుంది. స‌మంత ఇప్ప‌టికే కోలుకుంద‌ని...ఆరోగ్యం అంతా బాగానే ఉంద‌ని...బ్యూటీ విష‌యంలో ఎలాంటి మార్పులు రాలేదని అంటున్నారు.  సంక్రాంతి త‌ర్వాత  యాధావిధిగా 'ఖుషీ' సినిమా షూటింగ్ కి హాజ‌ర‌వుతుంద‌న్నారు.
Read more!

ఆ సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత హిందీ సినిమాలు పూర్తి చేస్తుంద‌ని తెలుస్తోంది. జ‌న‌వ‌రి నుంచి ఓ హిందీ సినిమా షూటింగ్ కి  హాజ‌రు కావాల్సి ఉండ‌గా ఖుషీ చిత్రీక‌ర‌ణ కార‌ణంగా కొంత జాప్యం చోటు చేసుకోవ‌చ్చు అన్నారు. ఏప్రిల్-మే నెల‌ల నుంచి పూర్తి స్థాయిలో హిందీ సినిమాల‌పై సామ్ దృష్టి పెడుతుంద‌ని స‌మాచారం. అలాగే స‌మంత కార‌ణంగా నిర్మాత‌లు ఎవ‌రూ ఇబ్బంది ప‌డ‌కూడ‌దని ఆమె బ‌ల‌మైన నిర్ణ‌యాల‌తో ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తుంది.

నిర్మాత‌లు స‌మంత‌పైనే న‌మ్మ‌కం పెట్టుకుని వెయిట్ చేస్తున్నారుట‌. త‌న‌క‌న్నా ఎన్నో ప్రాణాంత‌క వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డి హీరోయిన్లు సాధార‌ణ జీవితంలోకి వ‌చ్చార‌ని...అలాంటి చిన్న స‌మ‌స్య నుంచి తాను బ‌య‌ట ప‌డ‌టం పెద్ద విషయం కాద‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్త చేసిందిట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News