• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లిరోజు నాడు సమంత షేర్...

పెళ్లిరోజు నాడు సమంత షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్..!

By - Tupaki Desk
Update: 2021-10-07 06:30 GMT
టార్ హీరోయిన్ సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య తో విడిపోయిన సంగతి తెలిసిందే. పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. నాలుగేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చై-సామ్ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇకపై భార్యాభర్తలుగా ఉండబోమని.. వేర్వేరుగా సొంత మార్గాల్లో ప్రయాణించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ తమ అన్యోన్య దాంపత్యానికి ఫుల్ స్టాప్ పెట్టడం ఫ్యాన్స్ ని తీవ్రంగా కలచివేసింది. ప్రస్తుతం చైతన్య - సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటని అందరూ విశ్లేషిస్తున్నారు.

సమంత - నాగ చైతన్య జంట మధ్య అన్నీ బాగుంటే నేడు యానివర్సరీ జరుపుకునేవారు. 2017 అక్టోబర్ 7న హిందూ - క్రిస్టియన్ సాంప్రదాయాల్లో చై-సామ్ వివాహం జరిగింది. గోవాలో డెస్టినేషన్ పద్ధతిలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తమ నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ సమయానికి ఇద్దరూ విడిపోయారు. చైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెడుతూ వచ్చిన సామ్.. తాజాగా సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ షేర్ చేసింది. లాక్మే ఫ్యాషన్ వీక్ కోసం సమంత చేసిన ఫోటోషూట్ కు సంబంధించిన ఓ పిక్ ని పంచుకుంది.

సమంత ఈ ఫొటోలో తెల్లని దుస్తులు ధరించి కాళ్ళు పైకి లేపి నిలబడి ఉంది. కిందికి చూస్తున్న ఆమె జుట్టులో పింక్ గులాబీలు మరియు తెల్లని పువ్వులు అలంకరించబడి ఉన్నాయి. ఈ ఫోటోకి సామ్ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా పెట్టింది. ''పాత ప్రేమ పాటలు - పర్వతాలు మరియు శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోయలో మెలంచోలిక్ ధ్వనిని ప్రతిధ్వనించే ఆ పాత ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు . సందులలో గాలి శబ్దం'' అని సమంత ఈ ఫోటో కింద రాసుకొచ్చింది.

రేపు అక్టోబర్ 8 శుక్రవారం రాత్రి 7 గంటలకు సస్టైనబుల్ ఫ్యాషన్ వీక్‌ లో తనకు ఇష్టమైన షో కోసం ఎదురు చూస్తున్నట్లు సమంత ఈ పోస్ట్‌ ద్వారా పేర్కొంది. అయినప్పటికీ ఇందులో మరెదో లోతైన అర్థం వచ్చేలా క్యాప్షన్ ఉందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఈ రోజు సమంత-చైతన్య పెళ్లి రోజు కావడంతో సమంత రాసిన నోట్ లో ఏదో నిఘాడ అర్థం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నిన్న గురువారం ఓ యాడ్ షూటింగ్‌ లో పాల్గొన్న సమంత ఏదో తలచుకొని భావోద్యేగానికి లోనైనట్లు వార్తలు వస్తున్నాయి.
Tags:    
  • Samantha 
  • Samantha instagram 
  • Samantha naga chaitanya divorce 
  • Samantha Divorce 
  • Naga chaitanya samantha separation 
  • samantha movie Offers 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS