• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధైర్యాన్ని కూడగట్టుకునే...

ధైర్యాన్ని కూడగట్టుకునే పనిలో సమంత!

By - Tupaki Desk
Update: 2021-10-06 11:30 GMT
సినిమా పరిశ్రమలో కథానాయికగా నిలదొక్కుకోవడం .. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అందునా అటు తమిళంలో .. ఇటు తెలుగులో ఏక కాలంలో ఆమె  చక్రం తిప్పేసింది. స్టార్ హీరోలందరితో కలిసి భారీ విజయాలను అందుకుంది. వివాహమైన తరువాత కూడా సమంతకి భారీ అవకాశాలు వచ్చాయంటే, ఆమె టాలెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమంత చైతూ నుంచి విడిపోయి  అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇంకా ఆ విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

'లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. సక్సెస్ మీట్ సమయానికే విషయం చైతూకి తెలిసి ఉండటం వలన, ఆయన ఎంత ఆనందంగా కనిపించడానికి ప్రయత్నించినా ఏదో తెలియని వెలితి కనిపించింది. అయితే ఆ సక్సెస్ .. హడావిడి కొంతవరకూ ఈ బాధ నుంచి ఉపశమనాన్ని పొందడానికి ఔషధంలా పనిచేస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఒక రకంగా సమంత కంటే ముందుగా ఆయన ఈ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. చైతూ వెనుక రెండు బలమైన కుటుంబాలు ఉన్నాయి కనుక, ఆయనకి లభించే సపోర్టు కొంతవరకూ మనసును తేలిక పరుస్తుంది.

సమంత మొదటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తూ వచ్చినట్టుగానే కనిపిస్తోంది. పేరెంట్స్ ఉన్నప్పటికీ ఆమె వాళ్లతో ఎక్కడా కనిపించిన సందర్భాలు లేవు. తన గొడవేదో తాను పడుతూ వచ్చింది. ఒక రకంగా ఆ మానసిక వత్తిడిని తట్టుకోవడం కోసమే కొన్ని రోజుల ముందు ఆమె గుళ్లకీ .. గోపురాలకు తిరిగి ఉంటుంది .. స్నేహితులతో సరదాగా గడిపి ఉంటుంది. ఇకపై బద్ధకాన్ని పక్కన పెట్టేసి, తన పనులు తనే చేసుకోవాలంటూ ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టింది. ప్రస్తుతం 'గచ్చిబౌలి'లోని తన ఇంట్లోనే ఉంటోంది. ఆమె ధైర్యంగా బయటికి వచ్చి ఎప్పటిలా మళ్లీ దార్లో పడిపోవలసిన అవసరం ఉంది.

అందుకు అవసరమైన మనోధైర్యాన్ని ఆమె కూడగట్టుకునే పనిలో ఉందనే అనుకోవాలి. ఆమె నుంచి 'శాకుంతలం' సినిమా రానుంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అవి కార్యరూపాన్ని దాల్చడానికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా అయితే తాను ఫలానా సినిమాలు చేయనున్నట్టు ఆమె చెప్పలేదు. సమంత జనంలో తనకి క్రేజ్ తగ్గకుండా చూసుకోవడం ఇప్పుడు ఆమెకు కలిసొచ్చే అంశంగానే చెప్పుకోవాలి. సీనియర్ స్టార్ హీరోలతో జోడీకట్టగలదు .. నాయిక ప్రధానమైన బరువైన పాత్రలు చేయగలదు. సమంత కెరియర్ కీ .. క్రేజ్ కి ఇప్పట్లో ఢోకా అయితే ఉండదు. మునుపటి క్రేజ్ ఉంటుంది .. అయితే అప్పటి గౌరవం దక్కుతుందా అనేదే డౌటు!   
Tags:    
  • Samantha 
  • Samantha instagram 
  • Samantha naga chaitanya divorce 
  • Samantha Divorce 
  • Naga chaitanya samantha separation 

Similar News

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Copyright @2026

Powered by Blink CMS