సామ్ ఇంత‌గా చెల‌రేగిపోతుంద‌నుకోలేదు

Update: 2021-09-09 14:30 GMT
అక్కినేని కోడ‌లు స‌మంత ఇంత‌గా చెల‌రేగిపోతుంద‌నుకోలేదు!! కొన‌సాగుతున్న వివాదాస్ప‌ద వ్య‌క్తిగ‌త అంశాలు వేడి పెంచుతుంటే మ‌రోవైపు వాట‌న్నిటినీ మరిపించేలా స‌మంత యాక్ట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఓవైపు అక్కినేని నాగ‌చైత‌న్య‌తో సామ్ విభేధాలు అంటూ మీడియాలో క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. సోష‌ల్ మీడియాల్లో త‌న పేరులోంచి `అక్కినేని` తొల‌గింపు.. `ఎస్` అనే సింగిల్ అక్ష‌రంతో రీప్లేస్ చేయ‌డంతో కార‌ణాలు వెతికే ప‌నిలో ఉన్నారు కొంద‌రు. అయితే ఇదేమీ ప‌ట్ట‌ని స‌మంత మాత్రం ప్రొఫెష‌న‌ల్ గా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు.

స‌మంత ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుపడుతూ జాతీయ స్థాయిలో హాట్ డిబేట్ కి తెర తీసారు. ఇంత‌కుముందు లూయీస్ వీట్ట‌న్ ప్ర‌మోష‌న్ కోసం ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో డిజైన‌ర్ లుక్ తో ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు ఇప్ప‌టికీ అంత‌ర్జాలంలో వేడి పెంచుతూనే ఉన్నాయి. స‌మంత స్ట‌న్నింగ్ మేకోవ‌ర్ `ఆబ్స్` ఎలివేష‌న్ పై యువ‌త‌రంలో పెద్ద డిబేట్ న‌డించింది. సాటి నాయిక‌లు న‌టీమ‌ణులు కొలీగ్స్ అయితే స‌మంత కొత్త రూపం చూసి అసూయ చెందార‌నే చెప్పాలి.

తాజాగా స‌మంత మ‌రో హాటెస్ట్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకొచ్చారు. ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ నీతా లుల్లూ రూపొందించిన స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ తో స‌ర్ ప్రైజ్ చేశారు. హౌస్ ఆఫ్ నీతాలుల్లా పేరుతో ఈ ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వెబ్ లో దూసుకుపోతున్నాయి. స‌బ్ లైమ్ షైన్ లుక్ ఇది! అంటూ సామ్ దీనికి క్యాప్ష‌న్ ని జ‌త చేశారు. జుకాల్క‌ర్ స్టైలింగ్.. కోడూరు అమ‌ర్ నాథ్ హెయిర్ డిజైన్.. సాధ‌నా సింగ్ మేక‌ప్.. ఇషాన్ గిరి ఫోటోగ్ర‌ఫీ .. వసుంధ‌ర డైమండ్స్ క‌ల‌యిక‌తో ఓవ‌రాల్ గా ఫోటోషూట్ అద్భుతంగా కుదిరింది. లైట్ పింక్ అండ్ వైట్ డిజైన‌ర్ క్రిస్ట‌లైన్ డ్రెస్ లో సామ్ మ‌రోసారి షో స్టాప‌ర్ గా క‌నిపిస్తున్నారు.




Tags:    

Similar News