• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూ ఫంక్షన్ కు శామ్...

చైతూ ఫంక్షన్ కు శామ్ డుమ్మా? మరోసారి విడాకుల చర్చ!

By - Tupaki Desk
Update: 2021-09-20 05:35 GMT
నిప్పు లేనిదే పొగ రాదంటారు. కొన్నిసార్లు అలాంటిది చోటు చేసుకున్నప్పుడు.. వెంటనే ఆ పొగను ఆపేయాలి. లేదంటే.. అంతకంతకూ దట్టంగా మారి.. మొత్తంగా కమ్మేస్తుంది. ఊపిరి తీసుకోలేని రీతిలోఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోషల్ మీడియాలో తన పేరులో ఉన్న ‘అక్కినేని’ని తొలగించిన సమంత హాట్ టాపిక్ గా మారారు. బాలీవుడ్.. కోలీవుడ్ మీడియాలతో పోలిస్తే.. టాలీవుడ్ మీడియా తొందరపాటుకు ఇష్టపడదు. దూకుడుతనాన్ని ప్రదర్శించరు. నటుల వ్యక్తిగత విషయాల్ని అట్టే చర్చకు తీసుకురారు.

మరీ.. చాలా ముఖ్యమైన అంశమైతే తప్పించి.. దానికి సంబంధించిన విషయాల్ని పదే పదే ప్రస్తావించే ప్రయత్నం చేయరు. అదే సమయంలో.. టాలీవుడ్ నటులు సైతం వివాదాలకు దూరంగా ఉంటారు. అనుకోని రీతిలో వారు ఏదైనా ఇష్యూలో చిక్కుకుపోతే.. దాని క్లారిఫికేషన్ ఇస్తూ వస్తారు. అందుకు భిన్నమైన పరిణామాలు చైతూ సామ్ ఎపిసోడ్ లో చోటు చేసుకుంటున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న మాటను మాత్రం టాలీవుడ్ మీడియా రాస్తే.. బాలీవుడ్ మీడియా మాత్రం ఏకంగా విడాకులంటూ సంచలన ఆరోపణలు చేసింది.

అయితే.. దీనిపై అటు సమంత కానీ నాగచైతన్య కానీ స్పందించింది లేదు. ఎవరి దారిన వారు అన్నట్లుగా ఉండిపోతున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమంత.. అక్కడ చైతూ విషయాన్ని అడిగితే.. గుడి దగ్గర బుద్ది ఉందా? అంటూ అదేదో పాపం చేసినట్లుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భర్త గురించి భార్యను అడగకుండా ఎవరిని అడగాలన్న మాట చర్చకు వచ్చింది. అన్నింటికి మించి.. నిజంగానే చైతు.. సామ్ మధ్య ఏమీ లేదు.. అంతా బాగుందని అనుకుంటే.. ఆ మాటను ఒకసారి స్పష్టం చేస్తే.. మళ్లీ ఆ చర్చ ఉండదు కదా?

మరోవైపు ఈ ఇద్దరు విడిపోతున్నారన్న చర్చకు బలం చేకూరేలా ఘటనలు వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో పేరును మార్చుకోవటం.. ఈ మధ్యన చైతూ నటించిన లవ్ స్టోరీ మీద ట్వీట్ చేశారే కానీ.. అదంతా సామ్ మీద అక్కినేని ఫ్యాన్స్ తెచ్చిన ఒత్తిడి మాత్రమే. ఈ కారణంతోనే కావొచ్చు.. చైతూ ప్రస్తావన లేకుండానే ట్వీట్ చేశారు.

తిరుమలకు ఒంటరిగా వెళ్లిన సామ్.. తాజాగా లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరు కాలేదు. చాలా రోజుల తర్వాత చైతూ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ జరుగుతుండటం.. ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న పుకార్లు షికార్లు చేస్తున్న వేళ.. అలాంటి వాటికి చెక్ చెప్పే ప్రయత్నం చేయకపోగా.. ఆ తరహా వాదనలకు మరింత బలాన్ని చేకూర్చేలా సామ్ తాజా తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే.. ఈ ఇద్దరికి విడాకులు పక్కా.. అన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా దీన్ని ఖండిస్తారా? మౌనంగా ఉంటూ.. మరింత రచ్చ అయ్యేలా చేసుకుంటారా? అన్నది సామ్.. చైతూల మీదనే ఉందన్నది మర్చిపోకూడదు.
Tags:    
  • samantha 
  • samantha movies 
  • samantha rumors 
  • samantha about Naga chaitanya 
  • Samantha naga chaitanya 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS