• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు అర్హ ని నెక్స్ట్...

అల్లు అర్హ ని నెక్స్ట్ సూపర్ స్టార్ గా ప్రకటించిన సమంత..!

By - Tupaki Desk
Update: 2021-07-16 17:30 GMT
భారతీయ సినిమా ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ తరువాత.. ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల యాక్టర్స్ కలిగి ఉన్న ఏకైక ఫ్యామిలీగా 'అల్లు' వారు నిలిచారు. సమంత 'శాకుంతలం' సినిమాలో అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అల్లు అర్హ డెబ్యూ ఇస్తుండటం ద్వారా ఈ అరుదైన ఘనత సాధించారు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తే.. అల్లు అర్జున్ - అల్లు శిరీష్ ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నాల్గవ తరం నుంచి అల్లు అర్హ కూడా అడుగుపెట్టింది.

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణిక ప్రేమగాధ ''శాకుంతలం'' చిత్రంలో సమంత అక్కినేని - మలయాళ హీరో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో నటిస్తున్న అర్హ.. గురువారం టీమ్ తో జాయిన్ అయింది. ప్రస్తుతం తన పోర్షన్ షూటింగ్ పూర్తి చేస్తున్న అర్హ.. అప్పుడే స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు అందుకుంది. “ఆమె డైలాగ్స్ లన్నీ అర్థం చేసుకుని మొదటి టేక్‌ లోనే చెప్పేసింది. సూపర్ స్టార్ అవుతుంది. గాడ్ బ్లెస్” అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అల్లు అర్హను ఫ్యూచర్ సూపర్ స్టార్‌ గా ప్రకటించింది.

అర్హ బాబాయ్ అల్లు శిరీష్ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమె వారిని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. “#శాకుంతలం సినిమాలో ప్రిన్స్ భరత పాత్ర పోషించినందుకు మై బేబీ అల్లు అర్హ కు శుభాకాంక్షలు. ఖచ్చితంగా ఆమె మా అందరినీ గర్వపడేలా చేస్తుందని నేను అనుకుంటున్నాను” అని శిరీష్ పోస్ట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ సైతం ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

''అల్లు ఫ్యామిలీ నాల్గవ తరం నుంచి అల్లు అర్హ 'శాకుంతలం' చిత్రంతో తెరంగేట్రం చేస్తుండటం మాకు గర్వకారణం. నా కూతురి డెబ్యూ కోసం ఇలాంటి2 బ్యూటిఫుల్ సినిమా ఇచ్చినందుకు గుణశేఖర్ గారు మరియు నీలిమ గుణ గారికి ధన్యవాదాలు. నేను సమంత తో పూర్తిగా భిన్నమైన ప్రయాణాన్ని కలిగి ఉన్నాను. తన సినిమాతో అర్హ అరంగేట్రం చూడటం ఆనందంగా ఉంది. 'శాకుంతలం' మొత్తం తారాగణం మరియు సిబ్బందికి నా శుభాకాంక్షలు'' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

ఇకపోతే సోషల్ మీడియాలో తన ముద్దు ముద్ద మాట‌లతో ఆకట్టుకునే అల్లు అర్హ చేసిన 'అంజలి అంజలి' వీడియో సాంగ్ డిజిటల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ లపై 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. కెరీర్ ప్రారంభ దశలోనే తన టాలెంట్ తో ప్రశంసలు అందుకుంటోన్న అల్లు అర్హ.. భవిష్యత్ లో ఖచ్చితంగా సూపర్ స్టార్ అవుతుందని అల్లు ఫ్యాన్స్ అంటున్నారు.
Tags:    
  • allu arha 
  • allu arha photos 
  • allu arha video 
  • allu arha debut movie 
  • Shakuntalam 
  • samantha Shakuntalam 
  • Allu arha in Shakuntalam 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS