సమంత.. మహేష్‌ తర్వాత తమన్నా!

Update: 2021-10-09 05:34 GMT
ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో రేటింగ్‌ విషయంలో నిరాశ పర్చుతోంది. కర్టన్ రైజ్ ఎపిసోడ్‌ కు రామ్‌ చరణ్ హాజరు అవ్వడంతో ఆ ఎపిసోడ్స్‌ కు భారీ రేటింగ్‌ దక్కింది. ఆ తర్వాత తర్వాత రేటింగ్ విషయంలో జెమిని టీవీ వారితో పాటు నందమూరి అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ వ్యక్తం చేసే విధంగా ఉంది. అయితే సెలబ్రెటీలు హాజరు అయిన ఎపిసోడ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో షో నిర్వాహకులు ఆ విధంగా అయినా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే చరణ్‌ మొదటి రెండు ఎపిసోడ్స్ కు హాజరు అవ్వగా తదుపరి స్పెషల్‌ ఎపిసోడ్ లో కొరటాల మరియు రాజమౌళిలు హాజరు అయ్యారు. తాజాగా మహేష్‌ బాబు మరియు సమంతలు కూడా షో లో హాజరు అయ్యారు అనే వార్తలు వచ్చాయి. ఇంకా ఆ విషయమై అధికారికంగా ప్రకటన రాలేదు కాని వారు షూటింగ్‌ లో పాల్గొన్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. దసరాకు మహేష్‌ బాబు ఎపిసోడ్‌ రానుందా లేదంటే సమంత ఎపిసోడ్ రానుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సమంత ఎపిసోడ్‌ ను దసరాకు టెలికాస్ట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ను దీపావళికి తీసుకు రాబోతున్నాయి. వీరిద్దరి తర్వాత తమన్నా కూడా ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో లో హాజరు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఎవరు మీలో కోటీశ్వరులు షో లో తమన్నా కనిపించబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆ విషయమై చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ తో సమంతకు ప్రొఫెషనల్‌ గా స్నేహం ఉంది. ఇద్దరు కలిసి ప్రాజెక్ట్‌ లు చేశారు. కనుక ఈ షో లో ఇద్దరు కలిసి సందడి చేయడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సమంత స్పెషల్‌ ఎపిసోడ్‌ ఎప్పటికి టెలికాస్ట్‌ అవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. దసర మరియు దీపావళి స్టాల్స్ ఇప్పటికే సమంత మరియు మహేష్‌ బాబుతో బుక్‌ అయ్యాయి. కనుక ఏదైనా ప్రత్యేక సందర్బంలో ఈ షో ను టెలికాస్ట్‌ చేస్తారా లేదంటే ఒక వీక్ లో సందర్బం లేకున్నా కూడా టెలికాస్ట్‌ చేస్తారా అనేది చూడాలి. జెమిని టీవీ లో ఇప్పటికే తమన్నా మాస్టర్‌ చెఫ్‌ షో చేసి మద్యలో వెళ్లి పోయింది. కొన్ని కారణాల వల్ల మాస్టర్‌ చెఫ్‌ నుండి తప్పుకున్న తమన్నా పై జెమిని వారికి విభేదాలు లేవా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో అనూహ్యంగా ఎన్టీఆర్‌ షో లో తమన్నా కనిపించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు ఆ పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది.

తమన్నా హీరోయిన్ గా ఈమద్య కాలంలో కాస్త స్లో అయ్యింది. వెబ్‌ సిరీస్ లు మరియు ఇలాంటి షో లతో నెట్టుకు వస్తున్న తమన్నా సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడం కోసం వెయిట్‌ చేస్తోంది. ఇటీవల వచ్చిన సీటీమార్ సినిమా కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చినా కూడా తమన్నాకు కరోనా లేదా ఏదో ఇతర కారణాల వల్ల ఆఫర్లు అంతగా రావడం లేదు అనే కామెంట్స్‌ వస్తున్నాయి. అయితే తమన్నా మాత్రం మంచి స్క్రిప్ట్‌ కోసం వెయిట్ చేస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు మరియు లేడీ ఓరియంటెడ్‌ పాత్రలు వస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తమన్నా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. కనుక ముందు ముందు తమన్నా నుండి మంచి కాన్సెప్ట్‌ బేస్డ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చూస్తామనే అభిప్రాయంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తమన్నా ఆ దిశగా సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు. అంతకంటే ముందు ఎన్టీఆర్‌ తో ఎవరు మీలో కోటీశ్వరులు లో తమన్నా ఎలా ఎంటర్ టైన్ చేస్తుంది అనేది కూడా చూడాలి.



Tags:    

Similar News