• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అత్యంత ప్రమాదకర ప్రాంతంలో...

అత్యంత ప్రమాదకర ప్రాంతంలో 'సీతరామం'

By - Tupaki Desk
Update: 2022-04-13 05:41 GMT
దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్.. స్వప్న సినిమాస్ బ్యానర్ లో నిర్మాణం జరుగుతున్న చిత్రం 'సీత రామం'. ఇటీవలే శ్రీరామ నవమి సందర్బంగా ఈ సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేయడం తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసి సినిమా పై అంచనాలు అమాంతం పెంచారు. తెలుగు మరియు మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాలు కమర్షియల్‌ గా నిరాశ పర్చినా కూడా ఆయన విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. అందుకే సీత రామం సినిమా ను కాస్త ఎక్కువ బడ్జెట్‌ తోనే తెరకెక్కించేందుకు అశ్వినీదత్‌ అండ్‌ ఫ్యామిలీ ముందుకు వచ్చారు. ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను బోర్డర్ లో తెరకెక్కిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని కొన్ని ఆర్మీ సన్నివేశాలను అత్యంత కఠినమైన ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారట. ఆర్మీకి చెందిన క్యాంప్ ఏరియాలో సినిమా షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌ లోని హిక్కిం అనే గ్రామంలో ఈ సినిమా షూటింగ్‌ చేశారట. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి 440 మీటర్ల ఎత్తులో ఉండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.

అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 25 డిగ్రీలు ఉంటుందట. అక్కడ షూటింగ్‌ కు ఏ ఒక్కరు సాహసించరు. కాని సీత రామం టీమ్ అక్కడకు వెళ్లి మరీ షూటింగ్‌ చేసుకుని వచ్చారట. అంతటి సాహసం ఎందుకు చేశారు అంటే కథకు అత్యంత కీలక సన్నివేశం కనుక అక్కడ చిత్రీకరణ చేయాలని భావించినట్లుగా చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క సన్నివేశం కూడా అద్బుతంగా ఉంటుందని.. ఆర్మీ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు కష్టపడి చేసినట్లుగా మేకర్స్‌ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో రష్మిక మందన్నా కీలక పాత్రలో నటిస్తుంది. సినిమాలో మృనాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రష్మిక ఈ సినిమాలో ముస్లిం యువతి పాత్రలో కనిపించబోతుంది. ఆమె పాత్ర సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుందని ఇటీవల విడుదల అయిన గ్లిమ్స్ ను చూస్తే అర్థం అవుతుంది. యుద్ధం... ప్రేమ మధ్య నలిగే పాత్రలతో ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకుని చేస్తున్నాడు. దుల్కర్ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు.
Tags:    
  • Bollywood 
  • salmankhan 
  • starhero 
  • actor 
  • upcoming 
  • movie 
  • shooting 
  • sitaramam 
  • telugunews 
  • tupakinews 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS