పటానీ తర్వాత ఈమెపైనే భాయ్ మనసు..!
బాలీవుడ్ డార్లింగ్ బోయ్ సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఎందరికో లిఫ్టిచ్చారు. అంతంతమాత్రం కెరీర్ తో అవకాశాల్లేని ఎందరో నాయికలకు భాయ్ లిఫ్టివ్వడంతో ఆ తర్వాత స్టార్ హీరోయిన్లుగా ఏలారు. ఐశ్వర్యారాయ్- కత్రిన- జాక్విలిన్ ఫెర్నాండెజ్- డైసీ షా లాంటి భామలకు సల్మాన్ భాయ్ అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. స్నేహా ఉల్లాల్ కి అవకాశమిచ్చింది సల్మాన్ భాయ్. ఇక డెబ్యూ నాయికలెందరినో పరిచయం చేసారు.
ఇటీవల దిశా పటానీకి వరుస అవకాశాలిచ్చాడు సల్మాన్. కానీ ఆ సినిమాలేవీ హిట్టవ్వలేదు. ఇప్పుడు భాయ్ కన్ను పూజా హెగ్డే పై పడింది. బుట్టబొమ్మ అందచందాలు డ్యాన్సులు తనను విపరీతంగా ఆకర్షించాయట. అందుకే సల్మాన్ ఖాన్ వెంటనే ఆఫర్ ఇచ్చారు.
ప్రస్తుతం తన సరసన సినిమా చేస్తున్న పూజాకు దబాంగ్ టూర్ ఇన్విటేషన్ అందింది. మిడిల్ ఈస్ట్ లో తన దబాంగ్ టూర్ కోసం ఆమెను తీసుకువెళ్లాడు. పూజా తన కెరీర్ లో మొదటిసారిగా వేదికపై ప్రదర్శన ఇచ్చింది. ఇది సల్మాన్ ని బాగా ఆకట్టుకుంది.
సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పూజకు ఇది మొదటిసారి అయినా ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసిందంటూ పొగిడేశారు. పూజా చాలా మంచి నటి అని ఆమెతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని భాయ్ చెప్పాడు.
మరోవైపు పూజా హెగ్డే టాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తన తాజా చిత్రం రాధే శ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా ప్రచారంలో బిజీ కానుంది. అలాగే మహేష్ - త్రివిక్రమ్ సినిమాలోనూ పూజా నటించనున్న సంగతి తెలిసిందే.