'రాధే' థియేట్రికల్ రిలీజ్ అవుతుంది: సల్మాన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇదివరకు చెప్పినట్లు ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ జీ గ్రూప్ వారు సొంతం చేసుకున్నారు. ఈ 'రాధే ది మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమా గురించి తాజాగా ఈ సినిమా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని స్వయంగా ఒక నోట్ రూపంలో క్లారిటీ ఇచ్చాడు సల్లు భాయ్. "క్షమించండి, థియేటర్ యాజమాన్యానికి తిరిగి క్లారిటీ ఇవ్వడానికి చాలా సమయం పట్టింది. కరోనా లాంటి కష్టకాలంలో సినిమా రిలీజ్ అనేది చాలా పెద్ద నిర్ణయం. సినిమాలు లేక థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను నేను అర్థం చేసుకున్నాను.
అందుకే నేను నటించిన రాధే సినిమాను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. అందుకోసం థియేటర్ యాజమాన్యం వారు రాధే సినిమాను చూడటానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఈ ఏడాది ఈద్ పండుగ సందర్బంగా రాధే సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సంవత్సరం థియేటర్లలో రాధే చూసి ఆనందించండి” అంటూ రాసుకొచ్చాడు భాయ్. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కథానాయికగా దిశా పటాని నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్ లతో రాధే మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాతో యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఈ సినిమా సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ కాబోతుంది. ఇదివరకు వీరిద్దరూ కలిసి వాంటెడ్, దబాంగ్3 సినిమాలు చేశారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో..!!