• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సలార్' ఆడిషన్స్ బిగిన్:...

'సలార్' ఆడిషన్స్ బిగిన్: ప్రభాస్ తో నటించే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో..!

By - Tupaki Desk
Update: 2020-12-15 12:27 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ - దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో 'సలార్‌' అనే సినిమా రూపొందున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌ పై విజయ్‌ కిరంగందూర్‌ నిర్మిస్తున్నాడు. భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15న హైద్రాబాద్ లో ఆడిషన్స్ నిర్వహించనున్నట్లు దర్శకనిర్మాతలు ఇటీవల ప్రకటించారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఏదైనా భాషలో ఓ నిమిషం పాటు నటించిన వీడియోని తీసుకురావాలని.. దీనికి ఏజ్ లిమిట్ ఏమీ లేదని పేర్కొన్నారు. అయితే ఈరోజు 'సలార్' సినిమా కోసం ఆడిషన్స్ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ శేరిలింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిపారని తెలుస్తోంది. ఇలాంటి ఆడిషన్స్‌ త్వరలో బెంగళూరు, చెన్నై నగరాలలో కూడా నిర్వహించనున్నారు. మరి యంగ్ రెబల్ స్టార్ సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని ఎంతమంది దక్కించుకుంటారో చూడాలి. కాగా, 'సలార్' చిత్రాన్ని వచ్చే జనవరిలో స్టార్ట్‌ చేయనున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండటంతో 2021లోనే సినిమాను విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే 'రాధే శ్యామ్' షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న ప్రభాస్.. 'సలార్' తోపాటు 'ఆది పురుష్' సినిమాని కూడా చేయనున్నాడు.
Tags:    
  • Salaar 
  • Prabhas 
  • Prashant Neel 
  • Auditions 
  • Hyderabad 

Similar News

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

Copyright @2026

Powered by Blink CMS