• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: ‘సాక్ష్యం’...

ట్రైలర్ టాక్: ‘సాక్ష్యం’ డోస్ ఎక్కువైందే

By - Tupaki Desk
Update: 2018-07-07 17:42 GMT
బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా ‘సాక్ష్యం’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. జులై 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శనివారం ఆడియో వేడుకలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ‘సాక్ష్యం’ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. ఇంతకుముందు విడుదల చేసిన టీజర్ లాగే ట్రైలర్ కూడా భారీగా కనిపిస్తోంది. ఒక పెద్ద స్టార్ హీరో సినిమాకు ఏమాత్రం తగ్గని రీతిలో భారీ ఖర్చుతో సినిమాను తీర్చిదిద్దినట్లున్నారు. ఈ ట్రైలర్ చూస్తే ఇది బోయపాటి సినిమానా.. శ్రీవాస్ సినిమానా అన్న సందేహం కలగడం ఖాయం. బోయపాటి సినిమాల్లాగే భారీతనం.. లౌడ్నెస్ కనిపిస్తోంది ట్రైలర్లో. లొకేషన్లు కావచ్చు.. సెట్టింగ్స్ కావచ్చు.. తారాగణం కావచ్చు.. సన్నివేశాలు కావచ్చు.. పాటలు కావచ్చు.. అన్నింట్లోనూ భారీతనం కనిపిస్తోంది.

అదే సమయంలో కథను చెప్పే విషయంలో.. డైలాగుల్లో లౌడ్ నెస్ ఎక్కువైన భావన కలుగుతోంది. చాలా కమర్షియల్ సినిమాల్లాగే ఇది కూడా రివెంజ్ స్టోరీనే. ఒక తప్పు చేసి దానికి సాక్ష్యాల్లేకుండా చేసే ఉద్దేశంతో హీరో కుటుంబాన్ని విలన్లు అంతమొందిస్తారు. పసివాడిగా ఉన్న హీరోగా తప్పించుకుంటాడు. తర్వాత తిరిగొచ్చి అందరినీ అంతమొందిస్తాడు. ఐతే ఈ రివెంజ్ స్టోరీలో పంచభూతాలకు భాగస్వామ్యం కల్పించడం ద్వారా దీన్ని కొంచెం భిన్నంగా చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు శ్రీవాస్. హీరో శ్రీనివాస్ ‘జయ జానకి నాయకా’ స్టయిల్లోనే కనిపిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలకు సినిమాలో లోటు లేనట్లుంది. హీరోయిన్ పూజా హెగ్డే అందంగా కనిపిస్తోంది. జగపతిబాబు విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బేనర్లో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    
  • Bellamkonda Srinivas 
  • Pooja Hegde 
  • Sakshyam Trailer 
  • Sakshyam Movie Trailer 
  • Bellamkonda Srinivas Sakshyam Trailer 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS