• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరి తమ్ముడి చివరాఖరి ఆశ

పూరి తమ్ముడి చివరాఖరి ఆశ

By - Tupaki Desk
Update: 2017-03-07 10:56 GMT
పూరి జగన్నాథ్ పీక్స్‌ లో ఉన్న టైంలో ఆయన చేతుల మీదుగా కథానాయకుడిగా పరిచయం కావడం కంటే అదృష్టం ఇంకేముంటుంది..? పూరి తమ్ముడు సాయిరాం శంకర్ అలాంటి అదృష్టమే పొందాడు. కానీ హీరోగా అతడి తొలి సినిమా ‘143’ నిరాశ పరిచింది. ఆ తర్వాత కూడా తమ్ముడిని ఏదో రకంగా ఆదుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు పూరి. కానీ ‘బంపర్ ఆఫర్’ సినిమాకు స్క్రిప్టు ఇచ్చి దాన్ని నిర్మించినా.. ఆ తర్వాత ‘రోమియో’ సినిమాకు కథ అందించినా.. వేరే సినిమాలకు పరోక్ష సాయం అందించినా.. ఇలా చాలా రకాలుగా సాయిరాంకు పూరి సహకారం అందించినా అతను నిలదొక్కుకోలేకపోయాడు. కొన్ని నెలల కిందటే ‘అరకు రోడ్‌ లో’ అనే థ్రిల్లర్ తో ప్రేక్షకుల్ని పలకరించాడు సాయిరాం. అది కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘నేనో రకం’ మీదే ఉన్నాయి.

సుదర్శన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించడం విశేషం. జాతీయ అవార్డు అందుకున్న తమిళ నటుడు బాబీ సింహా భార్య రేష్మి మీనన్.. సాయిరాం సరసన కథానాయికగా నటించింది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎప్పుడో పూర్తయినా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు. కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని కొందరు మీడియా వాళ్లకు.. సినీ ప్రముఖులకు ప్రివ్యూలు వేసి చూపిస్తున్నారు. పర్వాలేదనే టాక్ వస్తోంది. పెద్ద సినిమాల తాకిడి తగ్గిన నేపథ్యంలో చిన్న సినిమాలకు ఇప్పుడే కాసిన్ని థియేటర్లు దొరుకుతున్నాయి. ఈ టైంలోనే సినిమాను రిలీజ్ చేసేయాలని చూస్తున్నారు. దిల్ రాజు బేనర్ మీద రిలీజవుతున్న ‘వెళ్లిపోమాకే’తో ఇది పోటీ పడనుంది. మరి ఈసారైనా సాయిరాం శంకర్ ఆశించిన ఫలితాన్నందుకుంటాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sairam Shankar 
  • Nenorakam Movie 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS