మెగా మేకోవర్ తో మేనల్లుడు వచ్చాడట!!

Update: 2018-09-29 10:26 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద వరస ఫ్లాపులు ఎదుర్కోవడంతో సినిమాలనుండి కాస్త బ్రేక్ తీసుకొని అమెరికా ట్రిప్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే.  ఫ్లాపులతో పాటుగా వెయిట్ కూడా పెరగడం తో లుక్స్ పై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో  మూడునెలలపాటు ఆమెరికాలో ఉన్న సమయంలో తన ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తాడని వార్తలు వచ్చాయి.

లేటెస్ట్ టాక్ ఏంటంటే మెగా మేనల్లుడు ఇండియాకు తిరిగొచ్చాడట.  రీసెంట్ గా హైదరాబాద్ లో స్టైలిష్ మేకోవర్ తో కనిపించాడట.  ఫిట్ గా మారడమే కాకుండా కొత్త హెయిర్ స్టైల్ - డిఫరెంట్ బియర్డ్ లుక్ తో కనిపిస్తున్నాడట.  ఈ విషయాన్ని మెగా కాంపౌండ్ కు సన్నిహితంగా ఉండేవారు నిజమేనని చెబుతున్నారు.  ఈలెక్కన తేజు తన తాజా చిత్రంలో ఫిట్ గా స్టైలిష్ అవతారంలో మెగాభిమానులను మురిపించబోతున్నాడన్నమాట.

అక్టోబర్ లో తేజు నెక్స్ట్ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా తేజు ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడుతుందని కోరుకుందాం.
Tags:    

Similar News