స‌ల్మాన్ ల‌వ‌ర్ కి మెగా ప్రిన్స్ లైన్‌

Update: 2019-12-23 09:53 GMT
సయీ మంజ్రేక‌ర్ .. ద‌ర్శ‌క‌ న‌టుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ కుమార్తె. ఇటీవ‌లే  రిలీజైన `ద‌బంగ్ 3` చిత్రంలో యువ‌ చుల్ బుల్ పాండే(స‌ల్మాన్ )కి ల‌వ‌ర్ గా న‌టించింది. ప్ర‌స్తుతం ఈ భామ‌ను టాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌రిస్తున్నాయ‌ని స‌మాచారం. తొలిగా మెగా కాంపౌండ్ లో క్రేజీ హీరో స‌ర‌స‌న జాక్ పాట్ కొట్టేసింద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ ఛాన్సిచ్చింది ఎవ‌రు.. అంటే?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే వ‌రుణ్ ఈ చిత్రం లో న‌టించేందుకు ప్రీ ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు అవుతున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం లో ఈసారి బాక్సింగ్ నేప‌థ్యం లో సినిమా కాబ‌ట్టి చాలా హార్డ్ గా ప్రిపేర‌వుతున్నాడు. బాక్సింగ్ ప్రాక్టీస్ సీరియ‌స్ గా సాగిస్తున్నాడు.

ఇక న‌టించిన తొలి చిత్రం తోనూ స‌యీ మంజ్రేక‌ర్ పేరు బాలీవుడ్ లో మార్మోగింది. దీంతో ఆమె పై ఇటు సౌత్ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల క‌ళ్లు ప‌డ్డాయి. క్యూట్ చ‌బ్బీ బ్యూటీ ఆరంగేట్ర‌మే క‌వ్వించే అందాల‌ తో మ‌తి చెడ‌ గొట్టింది. అందానికి అందం సెక్స‌ప్పీల్ ప‌ర్ఫెక్ట్ గా కుదిరాయ‌న్న టాక్ వ‌చ్చింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ ద‌ర్శ‌కులు వెంట‌ప‌డుతున్నార‌న్న‌ మాట‌.
Tags:    

Similar News