• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుడితే కర్నూల్లో బుట్టాలా...

పుడితే కర్నూల్లో బుట్టాలా .. చూస్తే 'కొండ పొలం' సినిమా జూడాలా

By - Tupaki Desk
Update: 2021-10-03 11:30 GMT
'మా భూమి' .. 'మంచు పల్లకి' వంటి సినిమాలతో తన కెరియర్ ను ప్రారంభించిన సాయిచంద్, చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'కొండ పొలం' సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. వైష్ణవ్ తేజ్ .. రకుల్ నాయకా నాయికలుగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను రూపొందించారు. సాయిచంద్ తో పాటు కోట శ్రీనివాసరావు .. నాజర్ .. రవిప్రకాశ్ .. హేమ ముఖ్యమైన పాత్రలను పోషించారు. నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్లో నిర్వహించారు. ఈ వేదికపై సాయిచంద్  కర్నూల్ యాసలో సందడి చేశారు.

" నేను పుట్టింది  కర్నూల్లోనే .. నాకు నాలుగు నెలలు ఉన్నప్పుడే హైదరాబాద్ కి వెళ్లిపోయాము. అయినా కర్నూల్ తో నాకు ఉన్న సెంటిమెంట్ ఎప్పుడూ గుర్తుకు వచ్చేది. కర్నూల్ యాసలో మాట్లాడాలని ఉండేది. 'మా భూమి'కి తెలంగాణ యాసలో మాట్లాడాను. 'ఎర్ర మల్లెలు'లో ఒంగోలు యాస .. మరో సినిమాలో శ్రీకాకుళం యాస .. ఇలా మాట్లాడుతూ వచ్చాను. 'ఉప్పెన'లో గోదావరి జిల్లా యాసలో మాట్లాడాను. 'సైరా' సినిమాలో సుబ్బయ్య పాత్ర వచ్చింది. కానీ అది నెల్లూరి యాస కాదు అన్నారు.

నెల్లూరి యాసలో మాట్లాడాలనే నా కోరిక 'కొండ పొలం' సినిమాతో తీరింది. నేనైతే నల్లమల అడవులు చూడలేదు. కానీ 'కొండ పొలం' నవల చదువుతున్నప్పుడు నల్లమల అడవులతో చాలా పరిచయమైపోతుంది. అలాంటి నవలను క్రిష్ గారు సినిమా తీయాలనుకోవడం ఒక శుభకార్యం వంటిదే. ఒకప్పుడు తెలుగు సాహిత్యానికి .. తెలుగు సినిమాకి చాలా అనుబంధం ఉండేది. ఆ బంధం ఎందుకో చాలా ఏళ్ల క్రితమే తెగిపోయింది. మళ్లీ ఈ సినిమాతో పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాను.

క్రిష్ గారితో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయనకి మంచి సాహిత్య పరిజ్ఞానం ఉంది .. తాను చిత్రీకరించే సన్నివేశాలపై పూర్తి క్లారిటీ ఉంది. ఆయనతో కలిసి పనిచేస్తుంటే .. దర్శకులు 'బాపు' గారి దగ్గర పనిచేస్తున్నట్టుగా అనిపించింది. ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తుంటే నాకు 'బాపు'గారే గుర్తుకు వచ్చారు. ఇక నేను కీరవాణిగారి సంగీతానికి అభిమానిని. ఆయన సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం.  

ఈ సినిమా కోసం మేమంతా 45 రోజుల పాటు ఒక చోట ఉండటం వలన, ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసిపోయాము. చివరిగా నేను చెప్పవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు .. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు. అతను 'ఉప్పెన'లో నా కొడుకు .. 'కొండ పొలం'లో నా కొడుకు. అతని మంచితనం .. అతనితో ఉన్న అనుబంధం గురించి, ఆయన కమిట్మెంట్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను. అందుకోసం ఆ విషయాలను అట్టిపెట్టుకున్నాను అంటూ వైష్ణవ్ తేజ్ ను హత్తుకున్నాడు. "దానమ్మా .. పుడితే కర్నాల్లో బుట్టలా .. చూస్తే 'కొండ పొలం' సినిమా జూడాలా" అంటూ కర్నూల్ యాసలో చాలా హుషారుగా సందడి చేశారు.     
Tags:    
  • Saichand 
  • Kondapolam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS