తల్లిదండ్రుల కోసం పెళ్లి వద్దనుకుంటుందట
ఫిదా బ్యూటీ సాయి పల్లవి పెళ్లి విషయమై గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. కోరుకున్న వ్యక్తితో సాయిపల్లవి పెళ్లికి రంగం సిద్ధం అయ్యింది. ఆమె రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటుందని ఆ తర్వాత సినిమాలు చేసే అవకాశం లేదు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లే అంటూ కొట్టిపారేసింది.
తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అస్సలు లేదు. నేను ప్రస్తుతం పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టాను. పెళ్లి విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. నాకు నా తల్లిదండ్రులు అంటే ప్రాణం. వారికోసం నేను ఎప్పటికి పెళ్లి చేసుకోకుండా ఉండాలని అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటే నేను వారితో ఉండనేమో. అందుకే నేను వారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని కోరుకుంటున్నాను.
ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు స్కిన్ షోకు మాత్రం నో చెబుతోంది. కోట్ల పారితోషికాలు కాదన్న సాయి పల్లవి కేవలం పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. తెలుగులో ఈమె "లవ్ స్టొరీ" సినిమాతో పాటు రానాతో విరాటపర్వం సినిమాను కూడా చేసింది. తాజాగా విరాటపర్వం నుండి వచ్చిన ఈమె లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.