చైతూని పొగిడేస్తే క‌మ్ముల వైపు కోపంగా చూసేద‌ట‌

Update: 2021-05-19 06:30 GMT
ద‌గ్గుబాటి - అక్కినేని బాండింగ్ గురించి తెలిసిందే. క‌జిన్స్ అక్కినేని నాగ‌చైత‌న్య‌- ద‌గ్గుబాటి రానా న‌డుమ రిలేష‌న్ ఆప్యాయతానుబంధాలు ఎంతో ముగ్దుల్ని చేస్తాయి. యాథృచ్ఛికంగానే అయినా ఆ ఇద్ద‌రితో ఒకే స‌మ‌యంలో సినిమాలు చేస్తోంది సాయిప‌ల్ల‌వి. చైత‌న్య‌తో ల‌వ్ స్టోరి.. రానాతో విరాఠ‌ప‌ర్వం చిత్రాల్లో న‌టిస్తోంది ఈ భామ‌. ఈ రెండు సినిమాలు ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా సెకండ్ వేవ్ వ‌ల్ల వాయిదా ప‌డ్డాయి.  

తాజాగా రానా హోస్టింగ్ చేస్తున్న నంబ‌ర్- 1 యారీ ప్రోమో రిలీజైంది. ఇందులో సాయిప‌ల్ల‌వి-చైత‌న్య‌-క‌మ్ముల‌.. హోస్ట్ రానాతో చాలా సంగ‌తులే పంచుకున్నారు. ఇక ఈ షో ఆద్యంతం సాయిప‌ల్ల‌వి డామినేష‌న్ క‌నిపిస్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. హైబ్రిడ్ పిల్ల సాయిప‌ల్ల‌వి ఈ షోకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌.

షోలో ల‌వ్ స్టోరి గురించి రానా ప్ర‌శ్న‌లు కురిపించ‌గా సాయిప‌ల్ల‌వి ఆన్స‌ర్స్ షాకిచ్చాయి. తాను పొసెస్సివ్ గా ఉంటాన‌ని త‌న ముందు నాగ‌చైత‌న్య‌ను పొగిడేస్తే క‌మ్ముల వైపు కోపంగా చూసేదానిని అని అన్నారు. అలాగే క‌మ్ముల ప‌నిలో త‌ల‌దూర్చి స‌ల‌హాలు కూడా ఇచ్చేస్తాన‌ని తెలిపారు.

ఇక సెట్స్ లో ఎవ‌రినీ ఎక్కువ పొగిడేయ‌న‌ని క‌మ్ముల అన్నారు. ఆర్టిస్టు ప‌ని న‌చ్చితే గుడ్ అంటాన‌ని.. న‌చ్చ‌క‌పోతే మానిట‌ర్ ముందు నుంచి లేచి వెళ్లిపోతాన‌ని క‌మ్ముల అన్నారు. మ‌ధ్య‌లో క‌ల్పించుకున్న‌ చైతూ ``దాదాపు గుడ్‌ అంటారు. ఈ మధ్య యాక్ అనే పదం కూడా నేర్చుకున్నారు`` అని స‌ర‌దాగా న‌వ్వేశారు. యాక్‌ అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ నేను చేయలేదన‌ని రానా అన‌డం ఆస‌క్తిక‌రం.

క‌మ్ముల‌తో సాయిప‌ల్ల‌వి.. రానా ఇంత‌కుముందు ప‌ని చేశారు. కానీ నాగ‌చైత‌న్య మాత్రం ఇదే తొలిసారి. ఆ న‌లుగురి న‌డుమ డిస్క‌ష‌న్ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. నంబ‌ర్ వ‌న్ యారీ ఫుల్ ఎపిసోడ్ ఇంకా ర‌క్తిక‌ట్టిస్తుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.
Tags:    

Similar News