రాజా సాబ్ బాక్సాఫీస్.. బుకింగ్స్ లో స్టన్నింగ్ రికార్డ్

ఈ సంక్రాంతి సీజన్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఊహించని పరిస్థితుల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది.;

Update: 2026-01-09 19:15 GMT

ఈ సంక్రాంతి సీజన్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఊహించని పరిస్థితుల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో నెలల తరబడి రకరకాల చర్చలు జరిగాయి. రిలీజ్ రోజున థియేటర్ల వద్ద వాతావరణం చూస్తే మాత్రం ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నట్లు అనిపించింది. ప్రేక్షకులు ఎగబడటంతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది.




​మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్లు, పోస్టర్లతోనే ఒక రకమైన ఊపును తెచ్చింది. ప్రభాస్ ని ఒక కొత్త లుక్ లో చూడాలని ఫ్యాన్స్ ఆశపడ్డారు. ముఖ్యంగా హారర్ కామెడీ అనేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాపై ఒక కన్ను వేశారు. అయితే సినిమా బయటకు వచ్చిన తర్వాత వినిపిస్తున్న అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలకి టాక్ తో పనిలేకుండా రన్ అవుతుంటాయి.

​అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రికార్డును క్రియేట్ చేసింది. ప్రముఖ టికెటింగ్ యాప్ బుక్ మై షో లో కేవలం మొదటి రోజే 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. 1 మిలియన్ నంబర్ తో ప్రభాస్ రేంజ్ ఏంటో మరోసారి క్లారిటీగా అర్ధమవుతుందని చెప్పవచ్చు. టాక్ తో సంబంధం లేకుండా మాస్ సెంటర్లలో రెస్పాన్స్ గట్టిగా ఉంది. కింగ్ సైజ్ సెలబ్రేషన్స్ అంటూ మేకర్స్ కూడా ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

​నైజాం, సీడెడ్ వంటి ఏరియాల్లో ఓపెనింగ్స్ అదిరిపోయాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా చోట్ల థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. రాజా సాబ్ విషయంలో జనాలు ప్రభాస్ ని స్క్రీన్ మీద చూసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే వసూళ్ల పరంగా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ​పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా ప్రమోట్ చేసింది.

ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడంతో కొన్ని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ గ్లామర్, మారుతి కామెడీ టైమింగ్ వంటి అంశాలు ఈ వసూళ్లకు ప్రధాన కారణమని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. సంక్రాంతి సెలవుల సీజన్ కావడంతో ఈ పికప్ ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ​మొత్తానికి రాజా సాబ్ డే వన్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటుకుంది. టాక్ ఎలా ఉన్నా సరే.. రికార్డులు మాత్రం ప్రభాస్ ఖాతాలోకి చేరుతున్నాయి. రానున్న వీకెండ్ లో ఈ వసూళ్లు హవా ఎలా కొనసాగుతుందో చూడాలి.

Tags:    

Similar News