టాక్సిక్.. ఖర్చంతా వారి వల్లే!
అప్పటివరకు కేవలం కన్నడ ఇండస్ట్రీ వరకు మాత్రమే తెలిసిన యష్, కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత ప్యాన్ ఇండియా హీరో అయిపోయారు.;
అప్పటివరకు కేవలం కన్నడ ఇండస్ట్రీ వరకు మాత్రమే తెలిసిన యష్, కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత ప్యాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆ రెండు సినిమాల వల్ల ఆయనకు ఎంతో స్టార్‌డమ్, క్రేజ్, డిమాండ్ ఏర్పడ్డాయి. అందుకే కెజిఎఫ్2 తర్వాత యష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారా? ఎలాంటి సినిమా చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
హీరోగానే కాదు నిర్మాతగా కూడా!
కానీ యష్ మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా గీతూ మోహనదాస్ అనే లేడీ డైరెక్టర్ తో చేతులు కలిపారు. ఎవరూ ఊహించని విధంగా గీతూతో సినిమాను ఓకే చేసిన యష్, ఆ మూవీలో నటించడం మాత్రమే కాకుండా దానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. టాక్సిక్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని గ్యాంగ్‌స్టర్ సినిమాగా వస్తుండగా ఈ సినిమాలో భారీ తారాగణమే నటిస్తోంది.
యష్ బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్
ఈ సినిమాను ఇంగ్లీష్ లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తుండటంతో పాటూ సినిమాలో పలు హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా ఇన్వాల్వ్ చేసి టాక్సిక్ కు మంచి బజ్ తీసుకొచ్చారు మేకర్స్. రీసెంట్ గా ఈ సినిమా నుంచి యష్ బర్త్ డే సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయగా, ఆ టీజర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే టీజర్ రిలీజ్ తర్వాత సినిమాలో నటించే నటీనటుల రెమ్యూనరేషన్ గురించి తెగ డిస్కషన్ నడుస్తోంది.
రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం యష్ ఏకంగా రూ.50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారని, హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ గతంలో కంటే చాలా ఎక్కువగా తన రెమ్యూనరేషన్ ను పెంచి రూ.15 కోట్లు తీసుకుంటున్నారని, కీలక పాత్రలో నటిస్తున్న నయనతార 12-18 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారని అంటున్నారు. తారా సుతారియా రూ.2-3 కోట్లు తీసుకుంటున్నారని, హుమా ఖురేషి 2-3 కోట్లు అందుకుంటున్నారని, రుక్మిణి వసంత్ రూ.3-5 కోట్లు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది పక్కనపెడితే టాక్సిక్ లోని తారాగణం కోసమే బడ్జెట్ భారీగా పెరిగిందనేది వాస్తవం. మార్చి 19న రిలీజ్ కానున్న టాక్సిక్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.