ఎడిట‌ర్ల‌ను నిజంగా గుర్తించేది వాళ్లే?

సినిమా అంటే ఎంతో మంది క‌ష్టం. ఆ క‌ష్ట‌మంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు తో మ‌ర్చిపోతారు.;

Update: 2026-01-09 16:30 GMT

సినిమా అంటే ఎంతో మంది క‌ష్టం. ఆ క‌ష్ట‌మంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు తో మ‌ర్చిపోతారు. వంద‌లాది మంది ముందు జ‌రిగే ఈవెంట్ ఎంతో ప్ర‌త్యేకం. ఆ రోజు అంద‌రీ క‌ష్టాన్ని గుర్తించి హీరో, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు మాట్లాడు తుంటారు. ఆ మాట‌లు..ప్ర‌శంస‌ల‌తో క‌ష్ట‌మంతా మ‌ర్చిపోతారు. త‌ర్వాతి సినిమాకు ఇంకా క‌ష్ట‌ప‌డాలి అనే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అదే ఆ శ్ర‌మ‌ను ఎవ‌రూ గుర్తించ‌క‌పోతే క‌లిగే బాధ అలాగే ఉంటుంది. అయితే ఇలాంటి వేడుక‌ల్లో ఎక్కువ‌గా హైలైట్ అయ్యేది హీరో, ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు, హీరోయిన్లు, నిర్మాత‌లు..ఇంకా సినిమాకు ప‌ని చేసిన ముఖ్య‌మైన వ్య‌క్తులు ఇంకొంద‌రు.

కానీ ఎడిట‌ర్ల‌కు మాత్రం తగిన గుర్తింపు రావ‌డం లేద‌న్న‌ది మార్తాండ్. కె. వెంకటేష్ ఆరోప‌ణ‌. ఈవెంట్ రోజున ముందు వ‌రుస‌లో 20 కూర్చీలు వేస్తే వాటిలో ముఖ్య‌మైన వ్య‌క్తులు కూర్చుంటారు. ఆ `రో`లో ఎడిట‌ర్ కు ఛాన్స్ ఉండి కూర్చుంటే? స్టేజ్ మీద‌కు వెళ్లిన త‌ర్వాత హీరో, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు వారిని గుర్తించి మాట్లాడుతారు. లేదంటే? ఆ మాట కూడా ఉండ‌ద‌న్నారు. నిజానికి ఇలా గుర్తించ‌డం స‌రికాద‌న్నారు. మ‌నిషి క‌నిపిస్తే మాట్లాడ‌టం ఏంటండి? ఆ వ్య‌క్తి ఎంత ప‌ని చేసాడు? అన్న‌ది వాళ్ల‌కు తెలియ‌దా? అలాంటి గుర్తింపు త‌న‌కు ఎంత మాత్రం వ‌ద‌న్నాడు.

త‌న‌తో పాటు చాలా మంది ఎడిట‌ర్లు అనుభ‌విస్తోన్న ఓపెయిన్ ఇది అన్నారు. నిజ‌మైన ఎడిట‌ర్ కు గుర్తింపు ఇవ్వాలంటే? ఫంక్ష‌న్ లో ఎడిటర్ లేన‌ప్పుడు గుర్తించి గుర్తుపెట్టుకుని మాట్లాడిన‌ప్పుడే? ఎడిట‌ర్ అనే వాళ్ల‌కు ఓ గౌర‌వం, గుర్తింపు ఉంటుంద‌న్నారు. త‌మ‌కు అలాంటి వ్య‌క్తుల గుర్తింపు మాత్ర‌మే కావాలన్నారు. మ‌నిషి ఎదురుగా ఉంటే మాట్లాడ‌టం..లేక‌పోతే లైట్ తీసుకోవ‌డం వంటివి న‌చ్చ‌వ‌న్నారు. ఈవెంట్ కి వెళ్లిన త‌ర్వాత బౌన్స‌ర్ల‌తో ఇబ్బందిగా మారుతుంద‌న్నారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ఫోన్ చేసి చెప్పుకోవాల్సిన ప‌రిస్థితులు దాప‌రిస్తున్నాయి.

ఈవెంట్ల‌లో స‌రైన మ‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డం కూడా స‌మ‌స్య‌గా మారుతోంది. ఇవ‌న్నీ ఎందుక‌నే త‌న‌తో పాటు చాలా మంది ఎడిట‌ర్లు సినిమా ఈవెంట్ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు తెలిపారు. ఒప్పుకుంటే ఏదైనా సినిమాకు ప‌ని చేయ‌డం..పారితోషికం తీసుకోవ‌డం.. ఆ త‌ర్వాత మ‌రో సినిమా చేసుకోవ‌డం త‌ప్ప పేరు, ప్ర‌ఖ్యాత‌లు సంపా దించాలి అనే ఆత్ర‌మైతే లేద‌న్నారు. మార్తాండ్. కె. వెంక‌టేష్ సీనియ‌ర్ ఎడిట‌ర్ గా కొన్ని సంవ‌త్స‌రాలుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సేవ‌లందిస్తున్నారు. ఎన్నో సినిమాల‌కు ఎడిట‌ర్ గా ప‌నిచేసి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

Tags:    

Similar News