• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టేస్టున్న ప్రొడ్యూసర్...

టేస్టున్న ప్రొడ్యూసర్ తమిళ సినిమాపై పడ్డాడు

By - Tupaki Desk
Update: 2016-02-17 05:30 GMT
డిస్ట్రిబ్యూషన్ నుంచి నిర్మాణంలోకి వచ్చి మంచి పేరు సంపాదించిన నిర్మాతల్లో సాయి కొర్రపాటి ఒకడు. తొలి ప్రయత్నంలోనే ‘ఈగ’ లాంటి సెన్సేషనల్ మూవీని నిర్మించిన సాయి.. ఆ తర్వాత అందాల రాక్షసి - ఊహలు గుసగుసలాడే - దిక్కులు చూడకు రామయ్యా లాంటి సినిమాలతో తన టేస్టు చాటుకున్నాడు. ఈ మధ్య నిర్మాణంలో కొంచెం స్పీడు తగ్గించినప్పటికీ.. కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని హోల్ సేల్ గా కొనేసి రిలీజ్ చేస్తూ తన బ్రాండ్ వాల్యూను నిలబెట్టుకుంటున్నాడు. రాజు గారి గది - జత కలిసే లాంటి సినిమాలతో మంచి ఫలితాన్ని అందుకున్న సాయి.. ఇటీవలే ‘గుంటూరు టాకీస్’ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాడు.

తాజాగా ఆయన కళ్లు ఓ తమిళ సినిమాపై పడ్డాయి. అదే.. ‘మిరుథన్’. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘యమపాశం’ పేరుతో తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం తమిళ - తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది ఈ చిత్రం. ఐతే తెలుగులో హడావుడిగా రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్రానికి థియేటర్లు ఎక్కడ దొరుకుతాయి, జనాలు ఎక్కడ పట్టించుకుంటారు అనుకుంటుండగా సాయి కొర్రపాటి లైన్లోకి వచ్చాడు. ఈ సినిమాను తన బేనర్ మీద రిలీజ్ చేస్తున్నాడు. ఇక తమిళ నిర్మాత గుండెల మీద చేయి వేసుకోవచ్చు. తెలుగులో మార్కెట్ కోసం చూస్తున్న జయం రవికి కూడా ఇది సంతోషాన్నిచ్చే విషయమే. హాలీవుడ్ లో పాపులర్ అయిన జాంబీ జానర్లో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. ఓ వైరస్ ప్రభావంతో మనుషులంతా రాక్షసుల్లా మారిపోతుంటే.. మిగతా ప్రపంచాన్ని కాపాడ్డానికి హీరో ఏం చేశాడనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. లక్ష్మీమీనన్ ఇందులో కథానాయిక. శక్తి సౌందర్ రాజన్ దర్శకుడు.
Tags:    
  • Sai Korrapati 
  • Yamapasam Movie 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS