• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా మేనల్లుడితో కలిసి...

మెగా మేనల్లుడితో కలిసి సుకుమార్ చేతబడి..?

By - Tupaki Desk
Update: 2022-05-31 05:22 GMT
గతేడాది సెప్టెంబ‌ర్‌ లో రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్.. ఇప్పుడు తన జీవితంలో కొత్త దశను ప్రారంభించాడు. దాదాపు ఆరు నెలలు ఇంటికే పరిమితమైన తేజ్.. SDT15 సినిమా కోసం మార్చిలో సెట్స్ లో అడుగుపెట్టాడు. చాలా రోజులకు మేక‌ప్ వేసుకుని ఎప్పటిలాగే షూటింగ్ లో పాల్గొంటున్నారు.

#SDT15 చిత్రానికి 'భమ్ బోలేనాథ్' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటమే కాకుండా.. కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఇది మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా అని తెలుస్తోంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

చేతబడి కారణంగా అనుమానాస్పద మరణాలు చోటుచేసుకున్న ఒక గ్రామానికి వచ్చే ముంబైకి చెందిన ఇంజనీర్‌ గా సాయి తేజ్ కనిపించనున్నారట. మిస్టీరియస్ సంఘటనలను హీరో ఎలా విశ్లేషిస్తాడు? వాటిని ఎలా పరిష్కరిస్తాడు? అనేది SDT15 మెయిన్ ప్లాట్ అని అంటున్నారు.

అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఇది డిఫరెంట్ జోనర్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందే సినిమా అని హింట్ ఇచ్చారు. అయితే ఇందులో చేతబడి అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తారని టాక్. సాయి తేజ్ తన కెరీర్ లో తొలిసారిగా ఇలాంటి సినిమా చేస్తున్నాడు. అది కూడా సుకుమార్ వంటి అగ్ర దర్శకుడు అందించే కథతో చేయడం ప్రత్యేకమనే చెప్పాలి.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఉప్పెన' సినిమాకి నిర్మాతగా వ్యవహరించి పంజా వైష్ణవ్ తేజ్ కు ఘనవిజయాన్ని అందించిన సుక్కూ.. ఇప్పుడు అతని సోదరుడు సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి సక్సెస్ ఇస్తారో చూడాలి.

ఇకపోతే సాయి తేజ్ చివరి చిత్రం 'రిపబ్లిక్' థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఓటీటీలో పర్వాలేదనిపించింది. ఇప్పుడు SDT15 పైనే మెగా మేనల్లుడు ఆశలు పెట్టుకున్నాడు. దీని తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ తమిళ్ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందేమో చూడాలి.
Tags:    
  • Tollywood 
  • megafamily 
  • hero 
  • saidharatej 
  • sukumar 
  • movie 
  • tupakinews 
  • latestnews 

Similar News

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS