సరదాకైనా కూడా ఆ డైలాగులు ఎందుకు?

Update: 2017-02-26 12:41 GMT
నాకు రేసుగుర్రం సినిమా అన్నా.. అలాగే నాన్నకు ప్రేమతో సినిమా అన్నా నచ్చదు అంటూ ''విన్నర్'' సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగును తీసుకుని ఇప్పుడు కావాలనే సాయిధరమ్ తేజ్ తన కజిన్ అల్లు అర్జున్ పై సెటైర్ వేశాడంటూ సోషల్ మీడియాలో తెగ రాస్తున్నారు. అయితే సరదాకైనా కూడా అలాంటి డైలాగులను మరీ అలా విపరీతార్ధాలు తీసుకుని అర్ధం చేసుకోవక్కర్లేదేమో.

నిజానికి ఈ సినిమాలో హీరోకు రేసుగుర్రాలు అంటే ఇష్టం ఉండదు. అదే సినిమాకు సెంట్రల్ పాయింట్. అలాగే తన తండ్రి అంటే కూడా ఇష్టం ఉండదు. అందుకే మనోళ్ళు ఏదో క్రేజ్ కోసం సరదాగా రేసుగుర్రం అండ్ నాన్నకు ప్రేమతో పేరును వాడేశారు. ఆ రెండు సినిమాలూ సదరు పాయింట్లో పాపులర్ కాబట్టి.. సరదాగా బాగుందని అనుకుని ఉంటారు. అంతేకాని వేరే ఎటువంటి ఆలోచనలూ చేసుండరు. కాని ఫ్యాన్స్ వాటిని అలా అర్ధం చేసుకుంటేగా.

ఇదే డైలాగులపై ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.. అసలు సరదాకైనా కూడా ఎందుకు అలా రేసుగుర్రం అండ్ నాన్నకు ప్రేమతో సినిమాల రిఫరెన్స్ తీయడం.. అలా చేస్తే ఖచ్చితంగా సదరు అభిమానులు హర్టవుతారుగా.. అంటున్నారు. ప్చ్.. వాళ్ళు చెప్పేది కూడా నిజమే మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News