• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కృష్ణవంశీతో సినిమా అని...

కృష్ణవంశీతో సినిమా అని చిరుకు చెబితే..

By - Tupaki Desk
Update: 2017-07-06 11:05 GMT
‘నక్షత్రం’ సినిమా కోసం కృష్ణవంశీతో పనిచేయడం పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఇది తనకు అరుదైన అవకాశమని.. ‘నక్షత్రం’లో అలెగ్జాండర్ అనే మంచి క్యారెక్టర్ ఇచ్చాడని.. ఈ పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపాడు. ఈ సినిమాలో తాను నటించబోతున్నట్లుగా తన మావయ్యలు చిరంజీవి.. పవన్ కళ్యాణ్ లకు చెబితే వాళ్లిద్దరూ కూడా చాలా సంతోషించినట్లు సాయిధరమ్ తెలిపాడు. అసలు తనకు ‘నక్షత్రం’లో నటించే ఛాన్స్ ఎలా వచ్చిందో.. కృష్ణవంశీతో పని చేయడం ఎలాంటి అనుభూతినిచ్చిందో ఈ చిత్ర ఆడియో వేడుకలో సాయిదరమ్ వివరించాడు.

‘‘కృష్ణవంశీ గారు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చేస్తున్నపుడు చరణ్‌ ను కలవడానికి షూటింగ్ స్పాట్ కు వెళ్లాను. అప్పుడు కృష్ణవంశీ గారితో మాటల సందర్భంగా ఎప్పుడైనా మీ సినిమాలో ఓ క్యారెక్టర్‌ ఉంటే చెప్పండి. చేస్తానన్నాను. ఆ మాటలను గుర్తు పెట్టుకొని ‘నక్షత్రం’లో అలెగ్జాండర్‌ అనే మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. కృష్ణవంశీ గారితో పని చేసే అవకాశం రాగానే చిరంజీవి.. పవన్ కల్యాణ్ మావయ్యల్ని కలిసి విషయం చెప్పాను. కృష్ణవంశీ సినిమాలో ఓ క్యారెక్టర్‌ చేస్తున్నాను అనగానే.. ఇద్దరూ వెరీ గుడ్.. ఆల్ ద బెస్ట్ అన్నారు. కృష్ణవంశీ గారి దగ్గర పనిచేస్తే నువ్వెంతో నేర్చుకొంటావంటూ చిరంజీవి మావయ్య చెప్పారు. నిజంగానే ఈ సినిమాతో చాలా నేర్చుకున్నా. ఈ సినిమా షూటింగుకి ఓ కాలేజీ స్టూడెంట్ లాగా వెళ్లాను. కృష్ణవంశీ గారు ఎన్నో విషయాలు నేర్పించారు. ఇందులో ఇది చాలా ఉద్వేగంతో కూడుకున్న పాత్ర. నటుడిగా నాకు బాగా పేరు తెస్తుంది. నక్షత్రం సినిమా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’’ అని సాయిధరమ్ తెలిపాడు.

Tags:    
  • Sai Dharam Tej 
  • Krishna Vamsi 
  • Nakshatram movie 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS