• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోడ్డు ప్రమాదంలో హీరో...

రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలు

By - Tupaki Desk
Update: 2021-09-10 16:41 GMT
ప్రముఖ సినీ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది.

మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మాదాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

సినీ హీరో సాయిధరమ్ వినాయక చవితి కావడంతో స్పోర్ట్స్ బైక్ పై రైడింగ్ కు వెళ్లినట్లు తెలిసింది. ఈక్రమంలోనే తీగల బ్రిడ్జిపై ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ వద్ద సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు.

అక్కడ గుర్తించిన స్థానికులు, పోలీసులు సాయిధరమ్ ను వెంటనే మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కుడికన్ను, చాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్థానిక సీఐ స్పందించారు. సాయిధరమ్ కుటుంబ సభ్యులకు ప్రమాదంపై చెప్పామని.. స్కానింగ్ కోసం సాయిధరమ్ ను పంపామని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిసిందని సీఐ తెలిపారు.

అయితే ప్రస్తుతం వైద్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితి నుంచి కోలుకున్నాడని.. మెలకువలోకి వచ్చినట్టు సమాచారం. ఆయనకు ప్రమాదం ఏమీ లేదని.. ప్రాణాపాయం లేదని తెలిసింది.  సాయిధరమ్ త్వరగా కోలుకోవాలని అభిమానులతోపాటు ‘తుపాకీ.కామ్’ కోరుతున్నారు. 
Tags:    
  • Sai Dharam Tej 
  • Sai Dharam Tej accident 
  • Sai Dharam Tej health condition 
  • Sai Dharam Tej bike accident 
  • Sai Dharam Tej Latest news 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS