వేసవిలో చిత్రలహరి చూపిస్తారట

Update: 2019-01-14 10:03 GMT
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.  ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజా ఈ సినిమా రిలీజ్ కు ముహూర్తం కూడా పెట్టారని వార్తలు వస్తున్నాయి.

మైత్రీ వారు 'చిత్రలహరి' కోసం ఏప్రిల్ 12 డేట్ ను లాక్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఇప్పటికే దాదాపు 70% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నెలాఖరుకల్లా మొత్తం టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తారట. మార్చ్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.  యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్.. నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా విజయం చాలా కీలకం. అదేరకంగా దర్శకుడు కిషోర్ తిరుమల కూడా 'నేను శైలజ' తర్వాత  చేసిన సినిమాలు విజయం సాధించలేదు. మైత్రీ బ్యానర్ వారు కూడా రెండు వరస ఫ్లాపులతో డల్ అయ్యారు.  మరి ఈ 'చిత్రలహరి' అందరికీ విజయం అందిస్తుందేమో వేచి చూడాలి.
 
    

Tags:    

Similar News