సాహో: తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ల పై వేటు!

Update: 2018-08-21 05:28 GMT
అప్పట్లో లీక్ అనే పదం అరుదుగా వినిపించేది కానీ ఇప్పుడు తరచుగా వినిపిస్తోంది. ఈమధ్యనే 'గీత గోవిందం' సినిమా అంతా విడుదలకు ముందే లీకయింది.  ఇదే కాదు ప్రభాస్ 'సాహో' సినిమాకు కూడా ఈ లీకుల బెడద తప్పటం లేదు.  'బాహుబలి-2' సినిమా రిలీజ్ కు ముందే 'సాహో' టీజర్ లీక్ అయింది. 'సాహో' మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయాలన్న డేట్ కు ముందే లీక్ కావడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

అంతే కాదు, 'సాహో' ఆన్ లొకేషన్ ఫోటోలు కూడా ఇప్పటికే పలుమార్లు లీకయ్యాయి.  దీంతో సినిమా లో ప్రభాస్ లుక్ కూడా బయటకు వచ్చేసింది. ఇక దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేందుకు సాహో మేకర్స్ చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారట. యూనిట్ మెంబర్స్ పై ఆంక్షలు విధించడం తో పాటుగా తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్లను ముంబై నుంచి వచ్చిన టీం తో రీప్లేస్ చేశారట. ఇద్దరు మాత్రం తెలుగు కో-డైరెక్టర్ లను మాత్రం అలాగే ఉంచారట.

వందలకోట్లతో ముడిపడిన ప్రాజెక్ట్ కనుక లీకేజ్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమే అయినా తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్ లను తప్పిస్తే సమస్య ఎలా పరిష్కరం అవుతుంది? ఇప్పటివరకూ తెలుగు అసిస్టెంట్ డైరెక్టర్లు లీకేజ్ విషయంలో నిందితులు కాలేదు.  మరి వాళ్ళను మాత్రమే తప్పిస్తే ఎలా? ఏదేమైనా ఒక ప్రాజెక్ట్ విషయం లో నిర్మాతలదే ఫైనల్ డెసిషన్. మరి వారికేం ఇబ్బంది అనిపించిందో!
Tags:    

Similar News