కల్ట్ సిరీస్ నుంచి సినిమా.. ‘మిర్జాపూర్ ది మూవీ’ టీజర్‌ రిలీజ్

తాజాగా విడుదలైన టీజర్‌లో మిర్జాపూర్ కల్ట్ క్యారెక్టర్లయిన కాలీన్ భయ్యా, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా ల పవర్‌ఫుల్ ఎంట్రీలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

Update: 2026-06-25 13:45 GMT

ఓటీటీ ప్రపంచాన్ని తన ఊర మాస్, యాక్షన్, డైలాగ్స్‌తో ఊపేసిన కల్ట్ సిరీస్ ‘మిర్జాపూర్’ ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై రచ్చ లేపేందుకు రెడీ అయింది. ‘మిర్జాపూర్: ది మూవీ’ పేరుతో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజర్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా రిలీజ్ చేశారు. టీజర్ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. సెప్టెంబర్ 4, 2026న విడుదల కాబోతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

యూట్యూబ్‌లో ట్రెండింగ్:

ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న 'మిర్జాపూర్' సినిమా టీజర్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ టీజర్‌కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ లభించింది. అటు నార్త్, ఇటు సౌత్ అనే తేడా లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అన్నింటిలోనూ ఈ టీజర్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ఓటీటీ రేంజ్‌ను మించి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా విజువల్స్ ఉండటంతో యాక్షన్ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాలీన్, మున్నా, గుడ్డు భయ్యా మాస్ స్వాగ్:

తాజాగా విడుదలైన టీజర్‌లో మిర్జాపూర్ కల్ట్ క్యారెక్టర్లయిన కాలీన్ భయ్యా, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా ల పవర్‌ఫుల్ ఎంట్రీలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ల తో సర్ప్రైజ్ చేసిన మేకర్స్, ఈరోజు టీజర్‌తో అసలు సిసలైన ట్రీట్ ఇచ్చారు. అపరిమితమైన అధికారం, గద్దె కోసం సాగే కుర్చీలాట, ముఠాల మధ్య దారుణమైన రక్తపాతం బ్యాక్‌డ్రాప్‌లో మునుపెన్నడూ లేని రేంజ్‌లో యాక్షన్ ఎలిమెంట్స్ ఈ టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

తెలుగులోనూ ఊర మాస్ డైలాగ్స్:

దక్షిణాదిలో కూడా ఈ సిరీస్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు భాషలోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు విడుదలైన తెలుగు టీజర్‌లో పవర్‌ఫుల్ డైలాగ్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇక గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో, పునీత్ కృష్ణ కథతో అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా నిర్మిస్తున్నారు.

చిన్న స్క్రీన్‌పై సంచలనాలు సృష్టించిన ‘మిర్జాపూర్’ ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై సరికొత్త ట్రెండ్ సెట్ చేయడానికి సిద్ధమైంది. టీజర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే, థియేటర్లలో కాలీన్ భయ్యా రాజసానికి, గుడ్డు భయ్యా మాస్ యాక్షన్‌కు బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరి సెప్టెంబర్ 4న రాబోతున్న ఈ కల్ట్ మూవీ థియేటర్లలో ఎలాంటి రికార్డులను వేటాడనుందో చూడాలి.

Full View
Tags:    

Similar News